మంచు ని చూస్తే మురిసిపోతూ వుంటాం, హిమాలయాలను చాలా దగ్గర నుండీ చూడాలనుకుంటాం, అలాగే ఆంగీస్ కు విహార యాత్రకు వెళ్లాలని అనుకుంటాం, సైబీరియా మంచు పర్వతాలలో విహరించాలని అనుకుంటాం. కానీ ఇప్పుడు మంచు అంటే యావత్ ప్రపంచానికే భయపడిపోయే పరిస్థితి వస్తుంది. మంచు కరుగుతుందంటే...? వెన్నులో వణుకు పుడుతోంది. మానందరినీ మైమరింపజేసే వెన్నెల హిమ పర్వతాల గర్భంలో...? భూమిపై ఉన్నా సకల జీవరాసుల మొత్తాన్ని తుడుచుకుపెట్టేసే ఎన్నో సరికొత్త రాక్షస వైరస్ లు దాగి ఉండడంతో...? ఇప్పుడు మానవాళికి భయాన్ని కలిగిస్తున్నాయి. భూ తాపానికి మంచు కరుగుతుంటే... పై ప్రాణాలు పైనే పోతున్న పరిస్థితి. వైరస్ అంటే..! ల్యాటీన్ భాషలో విషం అని అర్ధం. కంటికి కనిపించని ఈ జీవులు..! 15 నానో మీటర్ల నుంచీ 600 నానో మీటర్ల వరకు మాత్రమే ఉంటాయి. అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ జీవులు..! ఇతర జీవులపై దాడి చేస్తే మాత్రం, వాటి దాడి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే..! ఈ భూమిపై జీవించే ఎంత పెద్ద జీవులైన సరే వీటి దాడికి బొక్క బోర్ల పడాల్సిందే మరి. ఈ ప్రపంచాన్ని వణికించిన మలేరియా, ఎయిడ్స్, రాబీస్, పోలియో, ఎల్లో ఫీవర్, కోవిడ్ లాంటి భయంకరమైన వ్యాధులకు క...