Skip to main content

Zombie Virus Awakened? (Virtual Facts Telugu)

మంచు ని చూస్తే మురిసిపోతూ వుంటాం, హిమాలయాలను చాలా దగ్గర నుండీ చూడాలనుకుంటాం, అలాగే ఆంగీస్ కు విహార యాత్రకు వెళ్లాలని అనుకుంటాం, సైబీరియా మంచు పర్వతాలలో విహరించాలని అనుకుంటాం. కానీ ఇప్పుడు మంచు అంటే యావత్ ప్రపంచానికే భయపడిపోయే పరిస్థితి వస్తుంది. మంచు కరుగుతుందంటే...? వెన్నులో వణుకు పుడుతోంది. మానందరినీ మైమరింపజేసే వెన్నెల హిమ పర్వతాల గర్భంలో...? భూమిపై ఉన్నా సకల జీవరాసుల మొత్తాన్ని తుడుచుకుపెట్టేసే ఎన్నో సరికొత్త రాక్షస వైరస్ లు దాగి ఉండడంతో...? ఇప్పుడు మానవాళికి భయాన్ని కలిగిస్తున్నాయి. భూ తాపానికి మంచు కరుగుతుంటే... పై ప్రాణాలు పైనే పోతున్న పరిస్థితి. 

వైరస్ అంటే..! ల్యాటీన్ భాషలో విషం అని అర్ధం. కంటికి కనిపించని ఈ జీవులు..! 15 నానో మీటర్ల నుంచీ 600 నానో మీటర్ల వరకు మాత్రమే ఉంటాయి. అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ జీవులు..! ఇతర జీవులపై దాడి చేస్తే మాత్రం, వాటి దాడి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే..! ఈ భూమిపై జీవించే ఎంత పెద్ద జీవులైన సరే వీటి దాడికి బొక్క బోర్ల పడాల్సిందే మరి. ఈ ప్రపంచాన్ని వణికించిన మలేరియా, ఎయిడ్స్, రాబీస్, పోలియో, ఎల్లో ఫీవర్, కోవిడ్ లాంటి భయంకరమైన వ్యాధులకు కారణం...? అతి సూక్ష్మమైన ఈ వైరస్ లే. ఈ వైరస్ లు వాటి అంతటా అవి వృద్ధి చెందలేవు, వాటి మనుగడకు ఒక హోస్ట్ వాటికి అవసరం ఉంటుంది. అందుకే... మనుషులు, ఇతర జీవులు, చెట్లను ఆశ్రయించి, వాటి సంతానాన్ని వృద్ధి చేసుకొనేందుకు హోస్ట్ గా ఎన్నుకుంటాయి. 

ఇంతకీ ఈ వైరస్ లలో జీవం ఉంటుందా...? లేక ఇవి నిర్జీవ ప్రాణులా...? అనే దీనిపై చర్చ కొనసాగుతోంది. అయితే... ఈ వైరస్ లకు ప్రాణం ఉందా, లేదా అని పక్కన పెడితే..! అవి దాడి చేస్తే మాత్రం మరణాలు కచ్చితంగా ఉంటాయి. అంత ప్రమాదకరమైనవి ఈ వైరస్ లు. కానీ... వైరస్ లను చూడాలంటే..! సాధారణ మైక్రో స్కోప్ లు సరిపోవు. ఎలక్ట్రోన్ మైక్రో స్కోప్ లు ఉంటేనే వాటిని చూడగలం. ఇవి సాధారణ బ్యాక్టీరియాల పైన కూడా దాడి చేయగలవు. నిర్జీవంగా ఉన్నా వైరస్..! ఒక ప్రాణిలోకి చేరితే..! వాటి సంతానం అతి వేగంగా, వేలల్లో పెరిపోతుంది. ఏ జీవి శరీరంలో అది ఉంటుందో అది మొత్తం కబళించేస్తుంది.  

అదే..! కోవిడ్ 19 గుర్తుందిగా..! అదే... కరోనా వైరస్. అది కూడా వైరస్ నుండీ పుట్టిందే. 1918 నుంచి 1920 మధ్య ప్రాంతంలో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ 3 కోట్ల మందిని బలి తీసుకుంది. ఈ వైరస్ లు 0.3 శాతం నుంచీ 1.9 శాతం వరకూ పెరుగుతున్నాయని అనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులు, భూ తాపం పెరిగిపోవడమే అందుకు కారణం. కరోనా వైరస్ నుంచి ఇప్పుడప్పుడే భయటపడుతున్నా ప్రపంచం, తాజాగా బయటపడిన పిడుగు... ఈ జాంబీ వైరస్. ఈ తరహా వైరస్ ప్రపంచంలోనే భయానకమైనది. 48,500 సంవత్సరాలుగా మంచు శాశ్వత పొరలు మధ్యా నిద్రావస్థలో ఉండడం విశేషం. అయితే..! మానవుల తప్పిదాల వలన, భూమిని వాతావరణ కాలుష్యానికి గురిచేయడం చేత, ఎన్నో ఏళ్లుగా నిద్రావస్థలో ఉన్నా రక్కసి వైరస్ లను మేల్కొనేలా చేసి మన ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాము.

సైబీరియా తోడేళ్ల పేగుల్లో ఈ జాంబీ వైరస్ ఉన్నట్లు శాస్త్రవేత్తల బృందం గుర్తించారు. దానితోపాటూ... శరభౌ అనే ప్రాచీన జంతువు ఉన్నిని కూడా, రష్యా లోని శాశ్వత మంచు పొరల్లో ఉండడం, ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని చూసిన తర్వాత అసలు ఆందోళన మొదలయ్యింది. ఉత్తరార్ధ గోళంలో పావు వంతు శాశ్వతమైన మంచు పొరలతో నిండి ఉంది. అందులో శాశ్వతమైన, గడ్డ కట్టుకుపోయిన బ్యాక్టీరియాలు, వైరస్ లు భారీ మొత్తంలో ఉంటాయని అనుమానిస్తున్నారు. అయితే... జాంబీ వైరస్ తో పాటూ, మరి కొన్ని వైరస్ లు అచీన స్థితిలో ఉండడం విశేషం. భూ వాతావరణం వేడెక్కడం వలన, ఈ మంచు పొరలు కరిగిపోయి, అందులో లక్షల ఏళ్లుగా, గడ్డ కట్టుకొని ఉన్నా, ఆర్గానిక్ పదార్ధాలు విడుదల అవుతున్నాయి. ఈ ఆర్గానిక్ మేటర్ మరింతగా కుళ్ళిపోయి, వాటి నుంచి మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువులు వెలువడుతాయి. ఈ ప్రాణాంతక వైరస్ లను రష్యా లోని యుకేచి అలాస్ సరస్సు మంచు అడుగు భాగంలో ఉండడాన్ని రష్యా, ఫ్రాన్స్ జర్మనీ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది.

సాధారణంగా..! వైరస్ లు యాంటీ బయోటిక్స్ కి లొంగవు. వాటి కోసం ప్రత్యేకంగా... ఔషధాలు, టీకాలు, ఇంజెక్షన్ లు కనిపెట్టాల్సిందే. మందులకు లొంగవు కాబట్టే... కరోనా వైరస్ మనుషులను ముప్ప తిప్పలు పెట్టింది. రానున్న రోజుల్లో అనేక రకాల వైరస్ లు జంతువుల నుంచి మనుషులపై దాడి చేస్తాయని చాలా కాలంగా డబ్ల్యూ.హెచ్.ఓ అలాగే ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. కానీ చాలా దేశాలు ఆ హెచ్చరికని తేలికగా తీసుకున్నాయి. అంతెందుకు..! కరోనా కబళించే వరకూ, వైరస్ లను పట్టించుకొనే దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్త వైరస్ రాబోతుందన్నా విషయం ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ కన్నా అనేక రేట్లు వినాశకారిగా ఈ జాంబీ వైరస్ ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. 

మంచు ఖండాలలో శాశ్వతంగా గడ్డ కట్టిన పొరలు...? కరిగిపోతుండడంతో, కోవిడ్ తరహాలో మహమ్మారుల దాడి, రానున్న రోజుల్లో సాధారణమైపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేజేతులా కొని తెచ్చుకుంటున్నా ముప్పుని కట్టడి చేయాల్సిన బాధ్యత మనుషుపైనే ఉంది. ప్రపంచ అన్నీ దేశాలు మేల్కోవాల్సిన తరుణం వచ్చేసింది. మన భూమి పై పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అరికట్టాల్సిన బాధ్యత యావత్ ప్రపంచంపై ఉంది. ఆ పని చేయకపోతే...? మన చుట్టూ, వాతావరణంలో ఉన్నా భయంకరమైన వైరస్ లు మనపై దాడి చేయడం తథ్యం. ఈ రోజు కాకపోయినా, రేపు అనే రోజు కచ్చితంగా ఈ భయంకరమైన సూక్ష్మ రాకాసులు కబలిస్తాయి అనేది తథ్యం.ఈ వైరస్ ల ప్రభావం ఎక్కువగా గ్రీన్ హౌస్ మీదే పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచ అన్నీ దేశాలలోని మిగతా ప్రాంతాలలో మంచు  వేగంగా కరుగుతుందని చెబుతున్నారు. అదే కనుక జరిగితే...? మంచు కింద దాగివున్నా అనేక వైరస్ లు బయటకు వచ్చి...? భూ వాతావరణం మొత్తం విష వలయంగా మార్చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ శతాబ్దం చివరినాటికి...? అంటే...? 2100 సంవత్సరం నాటికి భూ ఉష్ణోగ్రత 2 - 3 డిగ్రీల సెల్సీయస్ పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే...? మంచు సరస్సుల్లో, మంచు కొండల్లో కూరుకుపోయిన వైరస్ లు భయపడి మానవాళిపై, భూమిపై బ్రతికే అన్నీ జీవ రాశులపై విరుచుకుపడతాయన్నది శాస్త్రవేత్తల వాదన. నిజానికి జాంబీ వైరస్ అన్నింటికీ అంటూ వ్యాధుల లక్షణం ఉంది. గ్లేసియర్స్ కరిగితే...? మరిన్నీ కొత్త వైరస్ లు బయటకు వచ్చే అవకాశం లేకపోదు. వేగంగా మంచు కరగడంతో, వేగంగా వైరస్ లు వ్యాపిస్తే...? సమస్తా... మానవాళికి పెను ముప్పును కలిగించకపోదూ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే ముప్పుకు జాంబీ వైరస్ ను, ఒక సాంపిల్ గా చూడాలి. ఎందుకంటే...? ముందు ముందూ చాలా పరిశోధనలు చేయడం అవసరం కూడా ఉంది. కరగకుండా ఉన్నా, మంచు కింద..! ఇంకా ఎన్నీ రకాల వైరస్ లు దాగి ఉన్నాయో ఇప్పుడే చెప్పడం కష్టం. 

కోవిడ్ తర్వాత నెలకొన్నా పరిస్థితుల్లో... ఏ కాలంలో, ఏ వైరస్, ఎటు నుంచీ ఎటాక్ చేస్తుందో అనీ టెన్షన్ తో పాటు అంతుపట్టడం లేదు. కోవిడ్ ఎఫెక్ట్ ఇంకా తొలగక ముందే...? శాస్త్రవేత్తలు జాంబీ వైరస్ ను కనుగొనడం, అదీ... కోవిడ్ కు మించి ఎక్కువ ప్రభావం చూపుతుందని తేల్చడం, మరింత భయం పుట్టిస్తుంది. దీనికి తోడూ... ప్రపంచ ఏదో ఒక మూలన కొత్త కొత్త వైరస్ లు బయట పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ మార్పులతో, మానవులు, ఏదో ఒక విపత్తు లతో ఎదుర్కొంటూనే ఉన్నారు.  వాటికి తోడూ..! వైరస్ లు కానీ పంజా విసిరితే...? ఇక మనుషుల మనుగడే ప్రశ్నర్ధకం అవడం ఖాయం. కనుక..! ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే...? వాతావరణ సమతుల్యాన్ని కాపాడాలి అలాగే గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించే ప్రయత్నం... ప్రపంచ దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్నీ బ్యాలన్స్ చేయగలిగితేనే..! వాతావరణం మళ్ళీ మన కంట్రోల్ కు వస్తుంది. అప్పుడే మంచు కరడం ఆగుతుంది. అప్పుడు  నిద్రాణ స్థితిలో ఉన్నా... వేల సంవత్సరాల భయానక వైరస్ లు, అలాగే వేల సంవత్సరాలు నిద్రాణ స్థితిలోనే ఉండిపోతాయి. లేకుంటే...? రానున్న ముప్పు...? ఊహకు కూడా అందనంత దారుణంగా ఉంటుందన్నదే వాస్తవం.





 

Comments

Popular posts from this blog

What was the reason for shutting down nutrine company? (Virtual Facts Telugu)

What was the reason for shutting down nutrine company? (Virtual Facts Telugu) Nutrine Chocolate కంపనీ మీకూ గుర్తుందా? పోనీ..? మనందరికీ చాలా చాలా ఇష్టమైన Nutrine Aasa Chocolate గుర్తుందా? పోనీ..? తేనేతో చేసిన మహా లాక్టో, హనీ ఫ్యాట్ Chocolates గుర్తుందా..? మరి ఇప్పుడు ఆ చాక్లెట్స్ ఏమైపోయాయి? నూట్రిన్ నుండీ తయారయ్యే ప్రతి ఒక్కటి కూడా మన దేశంలో చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే..? ఇది మన తెలుగు ప్రైడ్. మరీ! చాక్లెట్ ఇండస్ట్రీ ని, మన దేశంలో ఒంటి చేత్తో ఏలిన వ్యక్తి..! మన తెలుగు వాడు. అలాంటి మంచి చాక్లెట్ బ్రాండ్ కంపెనీని ఎందుకు నిలిపివేసారు? అసలు నూట్రిన్ కంపనీ వ్యవస్థాపకుడు ఎవరూ? అనేది ఇప్పుడు ఈ డాక్యుమంటరీ ద్వారా తెలుసుకుందాం! How did nutrine company grow?: మన పిల్లల బర్త్ డే ఫంక్షన్స్ కీ కచ్చితంగా నూట్రిన్ ఆశ చాక్లెట్లు ఉండాల్సిందే! అలా... ప్రతి పిల్లలు తమ తమ పుట్టినరోజున నూట్రిన్ ఆశ చాక్లెట్లు లను పంచడం ఒక అలవాటుగా మారిపోయిందంటే... ఆ చాక్లెట్ రుచిని మరవడం అనేది అసాధ్యమనే చెప్పచ్చు. అంతలా ఆశ చాక్లెట్..! పిల్లలు నుండీ పెద్దల వరకూ మనసు దోచుకున్న మన భారతదేశ సంస్థ మాత్రమే కాకుండా మన తెలుగు రాష్...

Tirumala Tirupati balaji mysterious story

  Tirumala Tirupati b alaji  mysterious story  తిరుమల బాలాజీ...! ప్రపంచంలోనే అత్యాద్మిక, ధనిక గొప్ప దేవాలయాలలో 2 వ స్థానంలో ఉన్నా ప్రముఖ అత్యాద్మిక, గొప్ప ధనిక దేవాలయం గా ప్రఖ్యాత చెందిన దేవాలయం... తిరుమల దేవాలయం. నిజానికి... Tirumala temple 2011 వ సంవత్సరం వరకు కూడా మొదటి స్థానంలో ఉండేది. ఆ తర్వాత Ananta padmanabha swami temple   లో సీక్రెట్ వాల్స్ ఓపెన్ చేశాకా, ఆ temple నెట్వర్క్ వచ్చేసి 1.0 లక్షల కోట్లు గా పెరిగి Tirumala ను ఓవర్ టేక్ చేసిందని చెబుతారు. కానీ అది నిజం కాదు. తిరుమల ఎసెట్స్ కౌంట్ చూస్తే..! బ్యాంక్ లో..! 10,250 Kg ల శ్రీవారి బంగారాన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేసింది TTD Board. అదేకాకుండా... 2,500 Kg ల బంగారం జువెలరీ రూపంలో ఉంది. 16,000 కోట్లు నగదు రూపంలో బ్యాంక్ లో డిపాజిట్ చేసుంది. India మొత్తంలో తిరుమల శ్రీవారి ప్రోపర్టీస్ 960 ఉన్నాయి. ఈ లెక్కన..! శ్రీవారి ఆస్తులు మొత్తం ఎంతుందో తెలుసా..? 2.5 లక్షల కోట్లు గా ఉంది. అయితే... ఇప్పటివరకూ తిరుమల టాప్ ప్లేస్ లోనే ఉంది. కాకపోతే..? పద్మనాభ స్వామి టెంపుల్ లో ఉండేది యాంటిక్స్ కిందకు వస్తాయి కాబట్టి, వాటి వి...

Virtual Facts Telugu Episode - 4

Fact No - 1: పాములు వాటి చర్మాన్ని ఎందుకు విడుస్తాయి?  సాధారణంగా పాములు వాటి చర్మాన్ని విడుస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే? పాములు వాటి చర్మాన్ని ఎందుకు విడిచి వెళతాయి అనేదే ఇప్పుడు  చెప్పబోయే ఈ ఫాక్ట్. అయితే? ఈ చర్మం వదిలే ప్రక్రియ ఒక్క పాములు మాత్రమే కాదు, దాదాపు ప్రతి జీవరాశి చేస్తుంది. అంతేందుకూ? మన మనుషులనే ఒక ఉదాహరణగా తీసుకోండి! మనుషుల శరీరం నుండీ కొన్ని మిలియన్ ఆఫ్ స్కిన్ సెల్స్  అనేవి కిందపడుతూ ఉంటాయి. అయితే? మన లాగా ఈ స్కిన్ సెల్స్ ముక్కలు ముక్కలుగా కింద పడేయవు. అవి ఒక లాయర్ లా అలాగే, ఆ జీవి ఉన్నా ఆకారం ఎలావుందో అలానే తన యొక్క చర్మాన్ని ఆ జీవి విడిచిపెడుతుంది. అలా ఒకే విధమైన పద్దతిలో ఆ జీవి తన చర్మాన్ని విడిచిపెట్టేదానినే...ఎగ్ డీసీజ్ అని అంటారు.    ఉదాహరణకు : ఒక పాము చర్మంతో పుట్టిందనుకోండి. ఆ పాము యొక్క బాడీ ఎదుగుదల అవుతుంది కానీ, ఆ పాము బాడీతో పాటూ, ఆ పాము యొక్క చర్మం మాత్రం ఎదుగుదల అనేది ఉండదు. ఆ పాము శరీరం పైనున్నా చర్మం కాకుండా మరొక లోపలి పొర చర్మం ఉంటుంది కదా, అది కూడా ఎదుగుదల అవుతుంది. ఆ  లోపలి పొర చర్మాన్ని వదిలేస్తుంది. ఒక పాము 4 ను...