What was the reason for shutting down nutrine company? (Virtual Facts Telugu)
Nutrine Chocolate కంపనీ మీకూ గుర్తుందా? పోనీ..? మనందరికీ చాలా చాలా ఇష్టమైన Nutrine Aasa Chocolate గుర్తుందా? పోనీ..? తేనేతో చేసిన మహా లాక్టో, హనీ ఫ్యాట్ Chocolates గుర్తుందా..? మరి ఇప్పుడు ఆ చాక్లెట్స్ ఏమైపోయాయి? నూట్రిన్ నుండీ తయారయ్యే ప్రతి ఒక్కటి కూడా మన దేశంలో చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే..? ఇది మన తెలుగు ప్రైడ్. మరీ! చాక్లెట్ ఇండస్ట్రీ ని, మన దేశంలో ఒంటి చేత్తో ఏలిన వ్యక్తి..! మన తెలుగు వాడు. అలాంటి మంచి చాక్లెట్ బ్రాండ్ కంపెనీని ఎందుకు నిలిపివేసారు? అసలు నూట్రిన్ కంపనీ వ్యవస్థాపకుడు ఎవరూ? అనేది ఇప్పుడు ఈ డాక్యుమంటరీ ద్వారా తెలుసుకుందాం!
How did nutrine company grow?:
మన పిల్లల బర్త్ డే ఫంక్షన్స్ కీ కచ్చితంగా నూట్రిన్ ఆశ చాక్లెట్లు ఉండాల్సిందే! అలా... ప్రతి పిల్లలు తమ తమ పుట్టినరోజున నూట్రిన్ ఆశ చాక్లెట్లు లను పంచడం ఒక అలవాటుగా మారిపోయిందంటే... ఆ చాక్లెట్ రుచిని మరవడం అనేది అసాధ్యమనే చెప్పచ్చు. అంతలా ఆశ చాక్లెట్..! పిల్లలు నుండీ పెద్దల వరకూ మనసు దోచుకున్న మన భారతదేశ సంస్థ మాత్రమే కాకుండా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో, చిత్తూరు జిల్లా లో ఈ నూట్రిన్ చాక్లెట్ తయారీ కేంద్రంగా తయారు చేయబడి, ఒక్క భారత దేశ మార్కెట్ మాత్రమే కాకుండా, ఇతర ఇతర దేశాల మార్కెట్ల సైతం మన దేశ చాక్లెట్ బ్రాండ్ విస్తీర్ణం అయ్యీ, ప్రపంచంలో చాలా చోట్ల మార్కెట్ లను సొంతం చేసుకుందంటే మీరూ నమ్ముతారా..? అంతలా... ప్రతి ఒక్కరి మనసు దోచుకున్న మన తెలుగు తియ్యని మిఠాయి ఆశ. ఇప్పుడు ఆ చాక్లెట్ కంటి చూపుమేరా కూడా కన్పించడం లేదు. ఒక్క ఆశ మాత్రమే కందందొయ్? నూట్రిన్ సంస్థ నుండీ ఇంకో రెండూ మధురమైన తియ్యని తేనేతో తయారు చేసినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా కనుమరుగైపోయాయి. అవేనండీ! Nutrine సంస్థ కు ప్రపంచం మొత్తం మీద మంచి పేరు తెచ్చి పెట్టిన Nutrine Maha Lacto, Nutrine Honey Fat. ఈ రెండూ చాక్లెట్లు అయితే అమోగమైన రుచిని మరిపించే మన తెలుగు మోస్ట్ బ్రాండెడ్ తేనే మిఠాయిలనే చెప్పచ్చు. ఆ సంస్థ కు అంతటి పేరు, ఘనతను తెచ్చి పెట్టిన ఇండియన్ ఒరిజినల్ బ్రాండెడ్ చాక్లెట్స్ కాబట్టి.
Nutrine Chocolaty Eclairs అయితే.... అప్పట్లో ఓ ట్రెండ్లీ. Chocolate లోపల Choco Cream తో తయారు చేసిన మొట్టమొదటి చాక్లెట్ ఇదే. అది కూడా మన దేశంలో. కొన్ని సంవ్సరాలపాటు ఏ అడ్డూ లేకుండా ఏకదాటితో కొనసాగిన ఈ బ్రాండెడ్ చాక్లెట్, తర్వాత కాలంలో ఏవో కొన్ని కారణాల చేత ఈ Nutrine Chocolaty Eclairs బ్రాండ్ ని నిలిపివేసింది ఈ Company. ఆ తర్వాత కొంత కాలానికి, ఎంతో పేరు తెచ్చిపెట్టిన Nutrine Chocolaty Eclairs పేరు ను కొంచం మార్చి, Nutrine Eclairs అనే బ్రాండ్ పేరుతో కొత్త రకం చాక్లెట్ ని పరిచయం చేసింది నూట్రిన్ కంపనీ. ఈ బ్రాండ్ కూడా మంచి ఆదరణతో, మన దేశంలోనే కాకుండా ఇతర ఇతర దేశాలకు కూడా ఎగుమతులు జరిగాయి. ఇలా Aasha, Maha Lacto, Honey Fat లాంటి చాక్లెట్లు మాత్రమే కాదు, ఇంకా మరిన్నీ బ్రాండెడ్ చాక్లెట్ల రుచులను ఇతర దేశాలకు చూపించిన ఘనత మన తెలుగు రాష్ట్రానికి, అలాగే మన దేశానికే దక్కే గొప్ప గౌరవం అది.
Who is B.Venkata Rami Reddy:
నూట్రిన్ కంపనీ అధినేత B.Venkata Rami Reddy గారు. ఈయనది..! ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా. దేశంలోనే కొత్తగా వ్యాపారం చేయాలన్నదే ఈయన కోరిక. దానికి తన ఇంటి నుండే సమాధానం దొరికింది. తన పిల్లలకు మంచి పేరున్న quality చాక్లెట్లు దొరకడం లేదనుకున్నారు. ఆ సమస్య నుండీ వచ్చిన ఆలోచనే..! తన కొత్త వ్యాపారానికి పునాది ఏర్పడింది. అదే..? మన దేశీయ చాక్లెట్ సంస్థ నూట్రిన్. ఇంకేమీ ఆలోచించకుండా అతి తక్కువ పెట్టుబడితో..! నూట్రిన్ అనే పేరుతో కొత్త ఇండియన్ చాక్లెట్ సంస్థ ను ప్రారంభించారు వెంకట రామిరెడ్డి గారు. తన సొంత జిల్లా వారికి పని కల్పించాలని, శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి..! వెంకట రామిరెడ్డి గారు. కంపనీ మొదలుపెట్టిన కొత్తల్లో... 60 మంది కార్మికులు పనిచేయగా, ఆ తర్వాత 600 మంది కార్మికులు పనిచేసే కంపనీగా తీర్చిదిద్దారు. నూట్రిన్ అంటే..? ఆ రోజుల్లో..! నూట్రిన్ చాక్లెట్ల డిమాండ్ విపరీతంగా ఉండేది. విదేశీ బ్రాండ్ కంపనీలు ఉన్నా... వాటిని కాదని , దేశంలో 34% మంది ఈ చాక్లెట్ మార్కెట్ ని ఆక్యుపై చేశారు. ప్రతిరోజూ కూడా..! నూట్రిన్, 1200 టన్నుల చాక్లెట్ లను తయారు చేసేది నూట్రిన్ సంస్థ. మన దేశం మాత్రమే కాదు. న్యూజిలాండ్, కెనడా, సౌదీ అరేబియా లాంటి దేశాలకు, మన నూట్రిన్ బ్రాండ్ ఎగుమతులు అయ్యేవి.
అయితే..! 2000 సంవత్సరం తర్వాత కథ మారిపోయింది. విదేశీయులు... మన దగ్గర చాక్లెట్స్ కొన్న డిమాండ్స్ ను పసిగట్టారు. దీంతో... అప్పటికే అక్కడ ఉన్నా..! అక్కడి విదేశీ చాక్లెట్స్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని, ఆ విదేశీ కంపనీలు..! వెంటనే..? ఇబ్బడి, మొబ్బడిగా చాక్లెట్ లను తయారు చేసి జనం మీదకు వదిలేయడం ప్రారంభించాయి. అవే! ఇప్పుడు మనం చాలా ఇష్టంగా ఆస్వాదించే Cadbary లాంటి ఓల్డ్ ఫేమస్ చాక్లెట్లు, మన మార్కెట్ ను ముంచెత్తాయి. ఇక జనం ఆదాయం కూడా పెరగడంతో, స్వదేశీ బ్రాండ్ అయినా... నూట్రిన్ ఆశ, మహా లాక్టో నుంచీ, విదేశీ బ్రాండ్ వైపు మొగ్గారు. విదేశీల కంపెనీల ముందూ మన బ్రాండ్ చిన్నబోయింది. ఆశ, మహా లాక్టో, చాకో బార్ లాంటి చాక్లెట్లు విల విల బోవడంతో, మన దేశీయ కంపెనీ అయిన నూట్రిన్..! ప్రతి సంవత్సరం నష్టాలను చవిచూసింది.
ఇక చేసేది ఏమీ లేక..? తమ మార్కెట్ ను నిలబెట్టుకోవాలని, Godrej సాయంతో తీసుకొని, 49% వాటాను అమ్ముకుంది నూట్రిన్. అయినా సరే! పెద్దగా లాభాలు రాలేదు. కానీ..? నష్టాలు మాత్రం తగ్గాయి. ఆ తర్వాత... Godrej కూడా ఆ కంపెనీని నడపలేక, ఆమెరికాకు చెందిన, ప్రముఖ బ్రాండ్ Hershey తో జతకట్టింది. కేంద్ర సర్కారు 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడంతో, Hershey కూడా గోద్రేజ్ నుండీ వెరుపడిపోయింది. దీంతో ఏమీ చేయలేక..? చిత్తూరు బ్రాంచ్ కాకుండా, బయట బ్రాంచ్లు అయినా... ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ బ్రాంచ్ లలో ఉద్యోగులను తీసివేయడం మొదలుపెట్టారు. 2013 నుంచీ 2016 వరకూ కూడా కంపెనీ ని ఎలాగో నెట్టుకొచ్చిన కూడా, చివరకు లాక్ ఔట్ ప్రకటించేశారు. ఇప్పుడు అదే హర్షీ లాంటి కంపెనీ కి లీజ్ కు ఇచ్చి, నూట్రిన్ బ్రాండ్ ను వదిలేయవలసిన పరిస్తితి వచ్చేసింది మన దేశానికి. అందుకే..? మనం ఎంతో ఇష్టంగా తింటున్నా ఆశ, మహా లాక్టో, చాకో ఎక్లరిస్, లాలిపాప్ లాంటి చాక్లెట్లు ఎక్కడా కనిపించడం లేదు. అలా... పోటీను తట్టుకోలేక, కొన్నీ తరాలు ఊపిన ఆశ... మనకు పూర్తిగా కనిపించకుండాపోయింది. అందుకు తగ్గట్టుగా జనరేషన్ మార్పు కూడా ఆశ, మహా లాక్టో లాంటి తియ్యటి తెలుగు మిఠాయిల రుచిని శాశ్వతంగా మరచిపోయేలా పతనానికి నాంది అయ్యింది.
మీరూ! ఇలాంటివి మరెన్నో వింతలు మరియూ విశేషాలను తెలుసుకోవాలంటే..? మా Virtual Facts Telugu బ్లాగ్ లేదా యాప్ ద్వారా వీక్షించండి!
Comments
Post a Comment