సాధారణంగా! మన భూమిపై(Earth) పగలు, రాత్రులు అనేవి సహజ సిద్ధమైన ప్రకృతి ప్రక్రియ. ఒక వేళ మన భూమిపై నిరంతరాయంగా 24 గంటలు, వెలుగు లేని చీకటి మాత్రమే ప్రపంచం అయితే ఎలా ఉంటుంది. అస్సలు ఊహించలేము కదా! మరి...మన భూమిపై(Earth) భగ భగమని మండుతూ, చీకటిని చీల్చుకొని, ప్రతి జీవి మనుడగకు జీవితాలలో వెలుగునిచ్చే మన సూర్యుడు(Sun) లేని చీకటి ప్రపంచంలో బతకడం ఈ భూమిపై(Earth) పుట్టిన ఏ జీవికి అది అసాధ్యమని మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే! వెలుగు లేని మనుడగను సాగించడం, ఏ జీవి కూడా అలా జీవించడం అనేది ఒక ఊహ మాత్రమే. ఎందుకంటే! అది ఊహకు కూడా అందని ఒక భయాంకర దృశ్యమే అవుతుంది కనుక.
అయితే? తెలంగాణ రాష్ట్రంలో, పెద్ద పల్లె జిల్లా, సుల్తానాబాద్ మండలంలో, కొదురుపాక(Kodurupaka Village) అనే గ్రామంలో మాత్రం ప్రకృతికి విరుద్ధంగా జరిగి, ప్రకృతికే సవాలు ను విసిరింది ఈ చిన్ని గ్రామం. ప్రతి రోజూ 16 గంటలు చీకటిలోనే గడుపుతున్నా ఆ గ్రామం పేరే కొదురుపాక(Kodurupaka). మరి ఆ ఊరిలో జరుగుతున్నది వింతనా? లేక అంతుచిక్కని మిస్టరీ నా?
ప్రతిరోజు ఉదయాన్నే మనందరినీ నిద్రలేపి పలకరించే అతిథే భానుడు(Sun). వద్దూ అంటే మానడు, రమ్మన్నప్పుడల్లా రాడు. సమ్మర్ వచ్చిదంటే చాలు! మనం ఎలా తప్పించుకోవాలో చూస్తాం. ఇక చలి కాలంలో అయితే సూర్యుడు కోసం తెగ ఎదురుచూస్తాం. అలా ఒక్కో సీజన్లో ఒక్కో లాగా ఉంటాడు ఆదిత్యుడు. కానీ ఇవన్నీ ఒక గ్రామానికి మాత్రం చెల్లదు. ఆ గ్రామంలో సూర్య కాస్త స్పెషల్. సాయంత్రం అయితే చాలు మొబ్బు చాటుకు వెళతాడు. ఇంకేముంది! ఇక ఆ గ్రామం చీకటి మయం. సాధారణంగా అన్నీ ఊర్లలలో ఉదయం, మధ్యహ్నం, సాయంత్రం ఉంటాయి, అయితే కుదురుపాకలో సాయంత్రం అనేదే ఉండదు. అక్కడ సాయంత్రం 4గం౹౹ లకే చీకటి పడిపోతుంది. మరీ 6 గం౹౹ అయిందంటే! జనాలు ఇళ్లల్లో నుంచీ బయటకురావడం మనేస్తారు.
సర్లే! సూర్యుడు ఉదయాన్నే తొందరగా పలకరిస్తాడా అంటే అది లేదు. ఆలస్యంగా వచ్చి, సాయంత్రం 4 గం౹౹ లకే గుడ్ బై చెప్పేస్తాడు మన మిస్టర్ సూర్య.
అసలు మిస్టరీ ఇదే! : -
ఈ ఊరికి నలు మూలలు ఉన్నా అతి పెద్ద గుట్టలే సూర్యోదయ, సూర్య అస్తమయానికి కారణమయ్యాయి. తూర్పుగా ఉన్నా గొల్ల గుట్ట గ్రామానికి అడ్డుగా ఉండడంతో ఇక్కడ సూర్య కిరణాలు ఆలస్యంగా పడుతున్నాయి. అంటే...ఈ గ్రామంలో మిగతా చోట్లకంటే గంట ఆలస్యంగా సూర్యోదయం అవుతుదన్నమాట. ఇక సాయంత్రం 4 గం౹౹ లకు సూర్యుడు గ్రామ పడమర దిక్కున ఉన్నా రంగనాయకల గుట్ట వెనక్కి వెళతాడు. దీంతో ఈ గ్రామాన్ని చీకటి అలుముకుంటుంది. అంటే సాయంత్రం 4 గం౹౹ లకు చీకటి పడడంతో ప్రతీ ఇంట్లో అలాగే వీధుల్లో లైట్లు వెలుగుతాయి.
ఈ ప్రాంతంలో కాంతి సహజ లక్షణాలయినా, పరావర్తనం, వక్రీభవనాలే కొదురుపాకలో ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
Comments
Post a Comment