Skip to main content

Virtual Facts Telugu Episode - 2


Fact No - 1: మీకూ తెలుసా! ప్రపంచంలో అతి పెద్ద, పొడవైన, లోతైన లోయ ఎక్కడుంది?

అదేనండి...ఈ భూమిపై అతి పెద్ద లోయ అనేది ఎక్కడుంది అనీ? దాని పేరే..."యార్లంగ్ జాన్గ్బో గ్రాండ్ కాన్యన్". ఈ కాన్యన్ 446 కి.మీ పొడవు, అలాగే 30 కి.మీ వెడల్పు, 1.6 కి.మీ డీప్ లోతు ఉంటుంది. ఇది భూమి మీద ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద లోయ అని చెప్పచ్చు. అయితే దీని కన్నా 10 రేట్లు పెద్దదైన లోయ ఒకటి ఉందని మీకు తెలుసా? అక్కడే తొక్క మీద కాలేశారు. అది మన భూమి మీద కాదండోయ్! ఇప్పుడు నేను చెప్పబోయే అతి పెద్ద భారీ లోయ మన సౌర కుటుంబ గ్రహాలలో ఒక గ్రహం అది, మనకు చేరువలో ఉన్నా, రాత్రి పూట అద్భుత కాంతితో కనబడే ఎర్రని గ్రహం మన అంగారకుడిపై ఈ అతి పెద్ద భారీ లోయ ఉంది. 


ఇది మన సౌర కుటుంబం మొత్తం మీద అది పెద్ద కాన్యన్ అని చెప్పచ్చు. ఎందుకంటే! ఇంత పెద్ద లోయ ఒక్క అంగారకగ్రహంపై తప్పా మరెక్కడా కనిపించదు కనుక. ఈ కాన్యన్ పేరు "వాలెస్ మారినెరిస్". ఈ అతి పెద్ద భారీ కాన్యన్ 3,000 కి.మీ పొడవు, 200 కి.మీ వెడల్పు, 10 కి.మీ లోతు ఉంటుంది. 10 కి.మీ లోతు అంటే అది ఎంత పెద్దదో ఓ సారి ఆలోచించండి. ఉదాహరణకు : లాస్ ఏంజిల్స్ నుండీ అట్లాంటిక్ కోస్ట్ వరకూ సరిపోయేంత పెద్ద కాన్యన్ అన్న మాట. 

Fact No - 2: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ టాయిలెట్ ఎక్కడుందో తెలుసా?


ఈ టాయిలెట్ 2,600 మీటర్ల ఎత్తులో ఉంది, అంటే దాదాపు 8,500 అడుగుల ఎత్తు. అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే? ఈ టాయిలెట్ ఒక పెద్ద కొండ ఎడ్జ్ లో ఉంది. అంటే! కొండ చివరి కోన భాగంలో ఉంది. ఇంకొక విచిత్రం ఏమిటంటే? ఈ టాయిలెట్ ని ఆపేది ఆ కొండ చివరిలో ఉన్నా ఆ  నాలుగు రాళ్లు మాత్రమే. అయితే ఈ టాయిలెట్ రష్యాలోని, సిబేరియన్ ఆల్టై మౌంటన్ పై ఈ డేంజరస్ టాయిలెట్ ఉంది. అక్కడ ఆ ప్లేస్ లో ఇంకేముందని అనుకుంటున్నారు? అక్కడా.....కేవలం ఆ టాయిలెట్ మాత్రమే కాదండోయ్, అక్కడొక వెధర్ స్టేషన్ కూడా ఉంది. ప్రతి నెలా పోస్ట్ మెన్ వచ్చి ఆక్కడి వెధర్ రిపోర్ట్ తీసుకొని వెళతాడు, అంతేకాదు! ప్రతి సంవత్సరం వెధర్ స్టాఫ్ వాళ్లు హెలికాప్టర్ లో వచ్చి అక్కడ పనిచేస్తున్న వాళ్లకు తాగటానికి నీళ్లు, భోజనం వండుకోవడాని అందుకు సంబంధించిన వస్తువులు, చలి కాచుకోవడానికి చక్కలు ఇచ్చి వెళతారు. 

Fact No - 3: చనిపోయిన ఒక పిల్లితో డ్రోన్ తయారీ ఎలా?


చనిపోయిన ఒక పిల్లితో ఒక డ్రోన్ ని తయారు చేశాడు ఒక మేధావి. పిల్లి ఏంటి?, డ్రోన్ ఏంటని అనుకుంటున్నారా? చెబుతా కాస్త అడగండి మరి!  "బార్ట్ జాన్సన్" అనే అతను, "ఆర్విల్లే" అనే పిల్లిని చాకేవాడు. ఆ పిల్లి ఒక రోజు ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది. తను ఎంతగానో ప్రేమగా చాకిన పిల్లి చనిపోవడం ఆ పిల్లి యజమాని మనస్సు బాగా కలిచివేసింది. ఆ తర్వాత ఆ పిల్లి యజమానికి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. 


చనిపోయిన ఆ పిల్లితో ఒక డ్రోన్ ని తయారుచేసి ఆ డ్రోన్ రూపంలో తన "అర్విల్లే" పిల్లిని చూసుకోవాలనుకున్నాడు. దానికి ప్రతిరూపమే! ప్రపంచంలోనే మొట్టమొదటి "డెడ్ క్యాట్ డ్రోన్" ని తయారు చేసాడు ఆ పిల్లి యజమాని. అంతే కాదండోయ్! చనిపోయిన ఆస్ట్రిచ్ తో కూడా ఒక డ్రోన్ ని తయారు చేయడం విశేషం. అంటే! ఏది ఎగరని పక్షో దానితో కూడా ఎగిరేలా చేసాడు "బార్ట్ జాన్సన్". ఇప్పుడు చెప్పండి! ఎగరని జంతువులను నింగిలోకి రివ్వున ఎగిరెలా చేసిన ఇతని ఘనతకి హాడ్స్సాఫ్ చెప్పాల్సిందే కదా!

Fact No - 4: మన టెక్నాలజీ ప్రపంచాన్ని అంతం చేస్తుందా?


ఒక రెండు నిజమైన ఏ.ఐ రోబోట్, అంటే ఆర్టిఫిషియల్ రోబోట్ లను మీరూ మనుషులను అంతం చేస్తారా? అని అడిగితే! అవి చెప్పిన సమాధానం వింటే మనం నిజంగా షాక్ అవ్వాల్సిందే! మరో పక్కా అవి చెప్పిన సమాధానం నిజమేమోనని అనిపిస్తుంటది. 


నేను చెప్పే రెండు రోబోట్ లలో ఒక రోబో పేరు "ఫిలిప్స్ కే డిక్". మనోడు మంచి సర్కాస్టిక్ ఏ.ఐ రోబోట్. ఆ రోబోట్ తనను ఇంటర్వ్యూ చేస్తున్నా రొపోర్టర్ తో ఏమి చెప్పిందంటే? నువ్వు నా ఫ్రెండ్ వి, నిన్ను ఏమి చేయను, కానీ మిమ్మలి జూ లో పెట్టి బంధించి చూస్తూ ఉంటాను అని సమాధానం ఇచ్చేసరికి రిపోర్టర్ కి, అలాగే అక్కడున్న ఆ ఇంటర్వ్యూ ని ఆసక్తికరంగా వీక్షిస్తున్నా అందరికీ ఒక్కసారిగా అందరీ తలలో ఫుస్ లు ఎగిరిపోయాయి. సింపుల్ గా ఆ రోబోట్ చెప్పింది ఏమిటంటే! మిమ్మలి చంపము, బందిస్తాను అని సల్లగా సావు కబురు చెప్పిందన్నమాట. 


ఇక 2016 సం౹౹ లో తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబోట్ "సోఫియా". అయితే తనని ఇంటర్వ్యూ చేసే రిపోర్టర్ ఇలా అడిగాడు? హ్యూమన్ ని డిస్ట్రయ్ చేస్తావా? అని. అందుకు సమాధానంగా "సోఫియా" "ఎస్...! ఐయామ్ డిస్ట్రయ్ హుమన్స్ అని అంది. అంటే! మన మనుషుల్ని నాశనం చేస్తాను అని. అయితే! అప్పటికీ ఆ రిపోర్టర్ చెప్పాడు అలా చెప్పొద్దని, కానీ అది హ్యూమనాయిడ్ రోబో మెషీన్ కదా తనకు అనిపించిందే చెప్పింది. ఆ తర్వాత "సోఫియా" మంచిగానే ఉంది, తర్వాత ఇంటర్వ్యూలో ఎందుకు అలా చెప్పావు అని అడిగితే? "ఏమో! ఆ రోజు నాకు అలా ఎందుకు అనిపించిందో తేలీదు" "ఎవరిని చంపాలని లేదు" అని సల్లని కబురు చెప్పింది రోబో పాపా. సో..! ఏది ఏమైనా...ఆర్టిఫిషియల్ రోబోట్స్ అంటే సొంతంగా ఆలోచిస్తాయి కదా, వాటితో మనకూ ఎప్పటికైనా చాలా డేంజర్ అని తెలుసుకోండి!

Fact No - 5: అనగనగా..! ఒక మిస్టీరియస్ యూట్యూబ్ ఛానెల్, అందులో???????


యూట్యూబ్...! ఈ రోజుల్లో ప్రపంచంలో అతి పెద్ద వీడియో ప్లాట్ఫార్మ్. అయితే! ప్రతిరోజు కోట్లల్లో ఎన్నో వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్నీ మిస్టీరియస్ ఛానెల్స్ కూడా ఉన్నాయి. అలాంటిదే ఒక ఛానల్ "వెబ్ డ్రైవర్ టోర్సో". అస్సలు వాళ్ళు ఆ వీడియోలో ఏం చూపిస్తున్నారో కూడా అర్ధం కాదు. అయితే ఆ ఛానల్ 2003 వ సం౹౹ లో స్టార్ట్ అయ్యింది. ఆ ఛానల్ స్టార్ట్ అయిన కొత్తలో ఆ ఛానల్ గురించి ఎవ్వరికీ తెలీదు. 

6 నెలలు గడిచాయి. ఆ ఛానెల్ లో ఫస్ట్ వీడియో అప్లోడ్ అయ్యింది. ఆ వీడియో 11 నిమిషాల నిడివి ఉంది. ఆ వీడియోలో ఏముందంటే? ఒక స్లైడ్ షో ఆఫ్ ర్యాండం బ్లూ అండ్ రెడ్ రెక్ట్యాంగిల్స్ ఉన్నాయి. అవి అటూ, ఇటూ మూవ్ అవుతూ ఉంటాయి, దానితోపాటు ఒక బీప్ సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. మొదటగా జనాలు ఈ ఛానల్ ని చూసి ఏవో పిచ్చి వీడియోలు అప్లోడ్ చేసారని నవ్వుకొనేవారు, కానీ జనాలను సప్రైజ్ చేయడానికి ఆ ఛానల్ కి ఎక్కువ టైం పట్టలేదు. ఎందుకంటే? పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రతి 3 నిమిషాలకు ఆ వీడియో అప్లోడ్ అవుతూనే ఉండేది. సీన్ కట్ చెస్ట్! అక్షరాల 6 లక్షల 24 వేల సబ్స్క్రయిబర్స్ కాదు, 6 లక్షల 24 వేల వీడియోలు ఆ ఛానల్ లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి. మీకూ ఇంకో విషయం తెలుసా? అందులో 80 వేల వీడియోలు మొదట కొన్ని నెలల్లో అప్లోడ్ చేసినవే.


2014 సం౹౹ లో ఇదొక పెద్ద మిస్టరీ. వరల్డ్ లో పెద్ద పెద్ద న్యూస్ చానెల్స్ అయినా బి.బి.సి, న్యూయార్క్ టైమ్స్ లాంటి న్యూస్ చానెల్స్ లో కూడా దీని గురించే ఆర్టికల్స్ వచ్చాయి. కొంతమంది ఐతే ఎలియన్స్ వేరే ప్లానెట్ నుంచి ఈ ఛానల్ ను ఆపరేట్ చేస్తున్నాయని, ఇంకొంత మంది ఐతే ఎల్యూనాటి అనే గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ వాళ్లు ఈ ఛానెల్ ను హ్యాండిల్ చేస్తున్నారని, అంటే సీక్రెట్ మెసేజ్ అలాంటివి లీడ్ చేసుకోవడానికి వాడుతున్నారని ఎన్నో ఉదంతలు, అపోహలు వచ్చాయి.

మళ్ళీ సీన్ కట్ చేస్తే! ఆ ఛానల్ బాగా వైరల్ అయ్యీ, మంచి పాపులర్ అయ్యింది. అప్పుడు గూగుల్ కన్ఫర్మ్ చేసిందేమిటంటే? మేము "ఆటోమేటెడ్ ప్రోగ్రాం టెస్ట్ వీడియో క్వాలిటీ" చేస్తున్నామని. అంటే! మనం యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేయకముందు మన దగ్గర ఉన్న వీడియో క్వాలిటీ, అప్లోడ్ చేసిన తర్వాత క్వాలిటీ తగ్గుతుంది కదా... ఆ క్వాలిటీ తగ్గకుండా ఉండేందుకు, అందుకోసం గా ఈ "ఆటోమేటెడ్ ప్రోగ్రాం వీడియో క్వాలిటీ టెస్ట్" చేస్తున్నామని గూగుల్ అఫీషియల్ గా చెప్పడం జరిగింది. అందుకోసంగా గూగుల్ వాళ్లు ఆ ఛానెల్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఇంకో విచిత్ర సంఘటన ఏమిటంటే? ఆ ఛానెల్ లో ఏమి ఉండకపోయినా ఆ ఛానల్ కు 2 లక్షల 4 వెల మంది సబ్స్క్రయిబర్స్ ఉండడం మరో వింత.

Comments

Popular posts from this blog

What was the reason for shutting down nutrine company? (Virtual Facts Telugu)

What was the reason for shutting down nutrine company? (Virtual Facts Telugu) Nutrine Chocolate కంపనీ మీకూ గుర్తుందా? పోనీ..? మనందరికీ చాలా చాలా ఇష్టమైన Nutrine Aasa Chocolate గుర్తుందా? పోనీ..? తేనేతో చేసిన మహా లాక్టో, హనీ ఫ్యాట్ Chocolates గుర్తుందా..? మరి ఇప్పుడు ఆ చాక్లెట్స్ ఏమైపోయాయి? నూట్రిన్ నుండీ తయారయ్యే ప్రతి ఒక్కటి కూడా మన దేశంలో చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే..? ఇది మన తెలుగు ప్రైడ్. మరీ! చాక్లెట్ ఇండస్ట్రీ ని, మన దేశంలో ఒంటి చేత్తో ఏలిన వ్యక్తి..! మన తెలుగు వాడు. అలాంటి మంచి చాక్లెట్ బ్రాండ్ కంపెనీని ఎందుకు నిలిపివేసారు? అసలు నూట్రిన్ కంపనీ వ్యవస్థాపకుడు ఎవరూ? అనేది ఇప్పుడు ఈ డాక్యుమంటరీ ద్వారా తెలుసుకుందాం! How did nutrine company grow?: మన పిల్లల బర్త్ డే ఫంక్షన్స్ కీ కచ్చితంగా నూట్రిన్ ఆశ చాక్లెట్లు ఉండాల్సిందే! అలా... ప్రతి పిల్లలు తమ తమ పుట్టినరోజున నూట్రిన్ ఆశ చాక్లెట్లు లను పంచడం ఒక అలవాటుగా మారిపోయిందంటే... ఆ చాక్లెట్ రుచిని మరవడం అనేది అసాధ్యమనే చెప్పచ్చు. అంతలా ఆశ చాక్లెట్..! పిల్లలు నుండీ పెద్దల వరకూ మనసు దోచుకున్న మన భారతదేశ సంస్థ మాత్రమే కాకుండా మన తెలుగు రాష్...

Tirumala Tirupati balaji mysterious story

  Tirumala Tirupati b alaji  mysterious story  తిరుమల బాలాజీ...! ప్రపంచంలోనే అత్యాద్మిక, ధనిక గొప్ప దేవాలయాలలో 2 వ స్థానంలో ఉన్నా ప్రముఖ అత్యాద్మిక, గొప్ప ధనిక దేవాలయం గా ప్రఖ్యాత చెందిన దేవాలయం... తిరుమల దేవాలయం. నిజానికి... Tirumala temple 2011 వ సంవత్సరం వరకు కూడా మొదటి స్థానంలో ఉండేది. ఆ తర్వాత Ananta padmanabha swami temple   లో సీక్రెట్ వాల్స్ ఓపెన్ చేశాకా, ఆ temple నెట్వర్క్ వచ్చేసి 1.0 లక్షల కోట్లు గా పెరిగి Tirumala ను ఓవర్ టేక్ చేసిందని చెబుతారు. కానీ అది నిజం కాదు. తిరుమల ఎసెట్స్ కౌంట్ చూస్తే..! బ్యాంక్ లో..! 10,250 Kg ల శ్రీవారి బంగారాన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేసింది TTD Board. అదేకాకుండా... 2,500 Kg ల బంగారం జువెలరీ రూపంలో ఉంది. 16,000 కోట్లు నగదు రూపంలో బ్యాంక్ లో డిపాజిట్ చేసుంది. India మొత్తంలో తిరుమల శ్రీవారి ప్రోపర్టీస్ 960 ఉన్నాయి. ఈ లెక్కన..! శ్రీవారి ఆస్తులు మొత్తం ఎంతుందో తెలుసా..? 2.5 లక్షల కోట్లు గా ఉంది. అయితే... ఇప్పటివరకూ తిరుమల టాప్ ప్లేస్ లోనే ఉంది. కాకపోతే..? పద్మనాభ స్వామి టెంపుల్ లో ఉండేది యాంటిక్స్ కిందకు వస్తాయి కాబట్టి, వాటి వి...

Virtual Facts Telugu Episode - 4

Fact No - 1: పాములు వాటి చర్మాన్ని ఎందుకు విడుస్తాయి?  సాధారణంగా పాములు వాటి చర్మాన్ని విడుస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే? పాములు వాటి చర్మాన్ని ఎందుకు విడిచి వెళతాయి అనేదే ఇప్పుడు  చెప్పబోయే ఈ ఫాక్ట్. అయితే? ఈ చర్మం వదిలే ప్రక్రియ ఒక్క పాములు మాత్రమే కాదు, దాదాపు ప్రతి జీవరాశి చేస్తుంది. అంతేందుకూ? మన మనుషులనే ఒక ఉదాహరణగా తీసుకోండి! మనుషుల శరీరం నుండీ కొన్ని మిలియన్ ఆఫ్ స్కిన్ సెల్స్  అనేవి కిందపడుతూ ఉంటాయి. అయితే? మన లాగా ఈ స్కిన్ సెల్స్ ముక్కలు ముక్కలుగా కింద పడేయవు. అవి ఒక లాయర్ లా అలాగే, ఆ జీవి ఉన్నా ఆకారం ఎలావుందో అలానే తన యొక్క చర్మాన్ని ఆ జీవి విడిచిపెడుతుంది. అలా ఒకే విధమైన పద్దతిలో ఆ జీవి తన చర్మాన్ని విడిచిపెట్టేదానినే...ఎగ్ డీసీజ్ అని అంటారు.    ఉదాహరణకు : ఒక పాము చర్మంతో పుట్టిందనుకోండి. ఆ పాము యొక్క బాడీ ఎదుగుదల అవుతుంది కానీ, ఆ పాము బాడీతో పాటూ, ఆ పాము యొక్క చర్మం మాత్రం ఎదుగుదల అనేది ఉండదు. ఆ పాము శరీరం పైనున్నా చర్మం కాకుండా మరొక లోపలి పొర చర్మం ఉంటుంది కదా, అది కూడా ఎదుగుదల అవుతుంది. ఆ  లోపలి పొర చర్మాన్ని వదిలేస్తుంది. ఒక పాము 4 ను...