అయితే...! ఇది ఎంతవరకు నిజమో తెలీదు. కేవలం మన ఈ ప్రపంచం రోజు రోజుకు అభివృద్ధి అవుతున్నా టెక్నాలజీ ని బట్టీ ఒక అంచనా మాత్రమే. ప్రస్తుతానికి మనం ఈ 2022 సం౹౹ లో ఉన్నాం కదా! ప్రెసెంట్ ఈ 2022 సం౹౹ నుండీ 2070 సం౹౹ వరకూ అలా వెళదాం.
ఇక విషయానికొస్తే! భవిష్యత్తులో మన సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందీ, మన ప్రతిరోజూ దిన చర్యలో చాలా మార్పులు రాబోతున్నాయి. అది ఎంతగా అంటే? మీరూ అస్సలు కలలో కూడా ఊహించని విధంగా. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యూచర్ టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ చూస్తే? మీరూ ఆశ్చర్యపోవాల్సిందే.
2022 సం౹౹ లో :- ఇప్పుడు మనం ఉంటున్నది 2022 వ సం౹౹ లో. అయితే! కొన్నీ నెలల్లోనే "బయోనిక్ ఐస్" ని చూడబోతున్నారు. చాలా మందికి వివిధ రకాల కళ్ళ సమస్యలు, దృష్టి లోపాలు ఉంటాయి, అలాంటి దృష్టి లోపాలున్నా వారి కోసం, ఇస్జ్రాయిల్ సర్జన్ లో, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, ఒక 70 ఏళ్ల ముసలావిడికి కుత్రిమ కళ్ళను అమర్చారు. అలాగే! బెల్జియం, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇలాంటి కుత్రిమ కళ్ళను తయారు చేసే పనిలో ఉన్నారు.
2023 సం౹౹ లో :- అమెరికాలోని మిస్సోరి యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రయోగం చేసారు. మనం ఇల్లు కట్టుకోవడానికి ఎర్రని ఇటుకలు ఉంటాయి కదా! దానికి బదులుగా, విద్యుత్చక్తి ని ఉత్పత్తి చేసే ఇటుకలు రాబోతున్నాయి. ఇప్పుడు మీరూ చూస్తున్న ఫోటో అదే. ఇందులోనుంచి విద్యుత్ ని ఉపయోగించచ్చు. అలాగే ప్రతి గంట గంటకు రీఛార్జ్ అవుతాయి ఈ ఇటుకలు. అంతేకాకుండా 2023 లో చాలా మార్పులు రాబోతున్నాయి. రైల్వే, ఎయిర్ లైన్స్ సిస్టం లో కూడా 2023 వ సం౹౹ లో మార్పులు చూడచ్చు.
2030 సం౹౹ లో :- ఓషియన్ వాటర్ ఫ్యూరీఫై :- మన భూమి 70% శాతం వరకూ వాటర్ తోనే నిండి ఉంది. మిగతా 30% శాతం మనం నివాసిస్తున్నాం. మరి! అందరూ ఎందుకు సేవ్ వాటర్... సేవ్ వాటర్ అంటారు. ఎందుకో తెలుసా? ఈ 70% వాటర్ లో కొంత వరకు మాత్రమే మంచి నీటిగా మనం త్రాగగలం, అది అందరికీ తెలిసిన విషయమే. సముద్రంలో వాటర్ ని త్రాగలేం. ఎందుకంటే? అది ఉప్పు నీరు కనుక. కానీ! 2030 లో సముద్రంలోని నీటిని ఫూరిఫై చేస్తారు. ప్రస్తుతానికి మనం చాలా ఇండస్ట్రీలలో, హాస్పిటల్లో, హోటల్స్ లలో ఆర్టిఫిషియల్ రోబోట్స్ లను ఉపయోగిస్తున్నారు. ఇక హాస్పిటల్ విషయానికొస్తే! ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
2040 సం౹౹ లో :- ఈ సంవత్సరంలో ప్రపంచం చాలా అప్డేట్ అవ్వబోతున్నది. అందులో ముఖ్యంగా మన ఇండియా. 2040 లో హైపర్ లూప్ బుల్లెట్ ట్రైన్స్ లాంచ్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి ట్రైన్స్ కేవలం ఒక్క గంటలో 1100 నుంచీ 1200 కి.మీ దూరం ప్రయాణం చేయగలవు. చాలా వరకూ 60% ఎలక్ట్రిసిటీ వెహికల్స్ నడుస్తాయి. దీని ద్వారా చాలా వరకూ పొల్యూషన్ అనేది అరికట్టవచ్చు. ఇక పవర్ విషయానికొస్తే! హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ బాగా వాడుకలోకి వస్తుంది. అలాగే బ్యాంక్ లకు సంబంధించి డిజిటల్ ట్రాన్సెక్షన్ బాగా వాడుకలోకి వస్తుంది. అంటే?ఈ సంవత్సరంలో కయిన్స్ కానీ, పచ్చ నోటు అనేది అస్సలు కనపడదు. అంటే? క్యాష్ ట్రాన్సెక్షన్, షాపింగ్, ట్రావలింగ్, ఆన్లైన్ అన్నింటికీ ఇక డిజిటల్ లక్ష్మీ నే.
2070 సం౹౹ లో :- ఆకాశాన్ని తాకినట్లుగా అనిపించే చుట్టూ అనేక పెద్ద పెద్ద భవనాలు ఏర్పడుతాయి. ఇక గాలిలో ఎప్పుడు రద్దీ రద్దీగా ఉంటుంది. ఇప్పుడు మనం కుక్కలు, పిల్లులను ఎలా పెంచుకుంటున్నామో, అలా ఈ 2070 లో చాలా వరకూ అందరూ రోబోట్ లను పెంచుకుంటారు. నేల మీద వాహనాలు ప్రయాణించడం చాలా తక్కువవుతాయి, అంటే? ఈ 2070 సం౹౹ లో హైపర్ టెక్నాలజీ గల అన్నీ రకాల వాహనాలు గాలిలో పక్షుల్లా ప్రయాణిస్తాయన్నమాట. ఎవరికీ ఏదైనా అవసరం, సాయం కోసం డ్రోన్ లను వాడుతారు. ఇప్పటి కాలంలో దొంగలు...ఇళ్ళల్లోనో, బ్యాంకుల్లోనో, చైన్ స్నాచర్స్, కిడ్నప్ దొంగలను చూసాం. అయితే ఆ టైంలో, అంత అడ్వాన్స్ టెక్నాలజీ వరల్డ్ లో దొంగలు ఎవరంటే? హ్యాకర్స్. ఈ హ్యాకర్లే ప్రపంచాన్ని వనికిస్తారు అప్పుడు. మనం తినే ఫుడ్ లో కూడా చాలా మార్పులు వస్తాయి. ఆ 2070 సం౹౹ లో అంతా జన్యూన్ ఫుడ్ నే తింటారు అందరూ. అంటే? ఆర్టిఫిషియల్ మీట్ తయారీ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది.
కానీ టెక్నాలజీ లో మనకూ బాగా ఉపయోగపడేది ఎయిర్ అంబులన్స్. ఈ ఎయిర్ అంబులన్స్ వల్లా, ప్రమాదంలో ఉన్న వాళ్ళను, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళను సులభంగా ప్రాణాలను కాపాడవచ్చు. ఎందుకంటే? ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఎమర్జెన్సీ కోసం హాస్పిటల్ కు తీసుకువెల్లడానికి కేవలం 4 ని౹౹ లకే ఎయిర్ అంబులన్స్ ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఇంటర్నెట్ విషయానికొస్తే! ఈ మార్పులన్నింటికీ కారణం ఇంటర్నెట్. 2070 నాటికి మన ఇంటర్నెట్ సోలార్ సిస్టం వైపుకు కూడా వెళుతుంది. అలాగే అక్కడ మన వాళ్ళతో కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు కూడా. ఇంకా! గాడ్జెక్ట్స్, మొబైల్స్, కంప్యూటర్స్ ఇలా అన్నీ ట్రాన్స్పరన్స్ లో ఉంటాయి. వాటి సైజ్ లు కూడా చాలా వరకూ తగ్గిపోతాయి. రానున్నా కొన్ని సంవత్సరాలలో ఎమోషన్స్ అండ్ రిలేషన్స్ కూడా కనిపించకపోవచ్చు. అలాగే చట్టాల్లో కూడా చాలా మార్పులు వస్తాయి. గవర్నమెంట్ జాబ్ మీద జనాలకు అంతగా ఆసక్తి ఉండదు. నిరుద్యోగతనం అనేది చాలా వరకూ తగ్గిపోతుంది. అయితే? ప్రతి సంవత్సరం కూడా టెక్నాలజీ పరంగా మార్పు అనేది జరుగుతూనే ఉంది. కాకపోతే! మానవుడు ఏర్పరుచుకున్నా ఈ సాంకేతిక విప్లవం, మంచికే వాడాలి తప్పా, చెడుకి కాదు. మరి చూద్దాం! ముందు ముందు రోజుల్లో ఈ మార్పు మంచికో లేక చెడుకో.
౼౼౼ The End
Comments
Post a Comment