Ravana history and mythology (Mysterious Story)
Ravana history and mythology:
రావణుడు ఎవరూ? అని మిమ్మల్నీ ప్రశ్నిస్తే? ఇది, చాలా తేలిక సమాధానం కదా? అని మీరూ తిరిగి బదులిస్తారు. కాకపోతే? మనం చిన్నప్పటినుండీ, రావణుడు అంటే, ఒక విలన్ అని వింటూ వచ్చాం. ఆయనకు సంబంధించినంతవరకూ, అన్నీ నెగిటివ్ విషయాలను విన్నాక, రామాయణం లాంటి మహా కావ్య, ఇతిహాసంలో ఆయనను ప్రతినాయకుడిగా చూస్తున్నాం. కానీ, రావణాశురుడు, చాలా ఇంటెలిజెంట్. మహా శక్తిశాలి కూడా. అయితే? రామాయణ కథకు ప్రతినాయకుడైనా రావణాశురుడు, రాముడి కోసం యజ్ఞం చేశాడన్న విషయం మీకూతెలుసా? కోపంలో, శని మహారాజునే బంధించేసాడన్న విషయం మీకూతెలుసా? రావణాశురుడికి సంభందించి, ఇలాంటి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని వింటే, మీ బుర్ర తిరిగిపోవలసిందే. రావణాశురుడు(Ravana), హిందూ ఇతిహాసమైన రామాయణంలో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం లంకకు అధిపతి. అలాగే, రాక్షసుల అధిపతి కూడా రావణుడే. పది రకాలుగా ఆలోచించగలడు అనే దానికి, పది రకాల విధ్యలలో ప్రావిన్యుడు అనే దానికి ప్రతీకగా? కళా రూపాలలో రావణుని? పది తలలతో చిత్రీకరిస్తారు. పది తలలు ఉండడం చేత ఈయనకు? దశముఖుడు, దసఖంఠరుడు, దశగ్రీవుడు అనే పేర్లు కూడా వచ్చాయి. దసరా ఉత్సవాలలో, రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఒక్కోసారి పాదరక్షకులతో కొడతారు. కానీ, రావణాశురుడు గొప్ప శివ భక్తుడు. జన్మతహా అతను బ్రాహ్మణుడు. వేదాలు, ఉపరిషత్తులను అభ్యసించి, శాస్త్రాలను అవపోషణ పట్టాడు. అంతులేని ఐశ్వర్యంతో, దేవతలను కూడా ధిక్కరించాడు. అపరిమిత శౌర్య పరాక్రమాలతో అందరినీ గడగడలాడించిన రావణుడు, ముల్లోకాలను తన అదుపులో ఉంచుకున్నాడు. ఆయన పాలించిన లంకా నగరం, బంగారముతో నిర్మించబడింది.
దానిని స్వర్ణ లంకా, అనే వారు. ఇన్నీ గొప్ప అర్హతలు ఉన్నప్పటికీ, సీతను అపహరించి, రాముడితో వైరం పెంచుకున్న, ఒకేఒక అనర్హతతో, ఆయన అసురుడు అయ్యాడు. ఇంతక ముందు మనం చెప్పుకున్నట్లుగా, రావణాశురుడు, రాముడి కోసం యజ్ఞం చేశాడు. ఇదిమీకూ నమ్మశక్యంగా లేదుకదా? అయితే, ఇది అక్షరాలా నిజం. వానర సైన్యంతో రాముడు, వంతెన నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే, ఈ వంతెన నిర్మాణం వెనుక, రావణాశురుడి సహకారం కూడా ఉందని ఎంతమందికి తెలుసు? వంతెనను నిర్మించక ముందు, శివునిని పూజించాలని నిర్ణయిస్తాడు. ఎందుకంటే, శివుడిని పూజించకుండా ఈ పని చేయకూడదని నిర్ణయించుకుంటాడు. యజ్ఞం చేయడానికి ఒక పండితుడు అవసరమవుతాడు. రావణుడు ఎంత శక్తివంతుడో, అంత వివేకం కలిగినవాడు కూడా. అందుకే, యజ్ఞం కోసం, రాముడు ఒక విజ్ఞాపన పత్రాన్ని రావణుడికి పంపుతాడు. ఎందుకంటే? రావణాశురుడు, శివుని పరమ భక్తుడు. అందుకని, ఈ యజ్ఞం వద్దనే మాట చెప్పలేదు. రావణుడు రామేశ్వరం వెళ్ళీ, ఈ యజ్ఞం, నిర్విఘ్నంగా జరిగేందుకు సహకరిస్తాడు.
ఈ యజ్ఞం పూర్తి చేయడమే కాదు. ఆ యజ్ఞం పూర్తి చేశాకా రావణుని కూడా, తన ఆశయ సిద్ధి కోసం, ఆశీర్వాదాలు కోరుతాడు. పండితుడైన రావణుడు, తథాస్తు అంటాడు. రావణుడు, సీతాదేవిని అపహరించినా కూడా, ఎందుకు ఆమెను ముట్టుకోలేదు? ఈ ప్రశ్న, చాలామంది మదిలో చలరేగుతోంది. ఒక వ్యక్తి, అన్యాయంగా ఒక మనిషిని అపహరించి ఎత్తికెళ్లాకా, ఆ వ్యక్తిని ముట్టుకోలేదు అంటే, అది రావణాశురుడి మంచితనమే అనుకుంటారు. కానీ, ఈ కథలో మరో కోణం కూడా ఉంది. రావణాశురుడు, స్త్రీ లోలుడు. ఈ కారణంగానే, నరకోరా అనే అర్థాంగితో తప్పుగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. అప్పుడు నరకోరా అర్థాంగి రావణాశురుడిని శపిస్తుంది. ఏ మహిళనైనా, ఆమె అంగీకారం లేకుండా ముట్టుకుంటే కనుక, అది తన వినాశనానికి దారి తీస్తుందని. ఈ కారణం చేత, సీతను అపహరించినా కూడా, రావణుడు ఆమెను తాకలేదు. రావణాశురుడు, సీతాదేవిని ఎంత సునాయాసంగా అపహరించాడో, అంత సునాయాసంగా పెళ్లి కూడా చేసుకోవచ్చు. కానీ, నరకోరా అర్థాంగి శాపంతో, తన కారణంగా రాజ్యం కష్టాలుపాలవడం తనకు ఇష్టం లేక, సీతాదేవికి దూరంగా ఉన్నాడు. శనిదేవుడిని బంధించాడు. ఈ విషయం, మనం మొదట్లో చెప్పుకున్నాం. దీనికి ఓ కారణం ఉంది. రావణాశురుడికి జ్యోతిష్యశాస్త్రం పై మంచి పట్టుంది. సాధారణంగా, ప్రతి మనిషి పుట్టుక తర్వాత, ఆ పుట్టుక గ్రహాలు, వాటి కదలికలపై పడుతుంది. వివేకవంతుడైన రావణాశురుడికి ఈ విషయం బాగా తెలుసు. అందుకే, జ్యోతిష్యంలో గ్రహాలు, వాటి గమనాల కదలికలు, శాస్త్రాలను గట్టిగా నమ్ముతాడు. అందుచేతనే, తనకున్న శక్తితో, తనకు పిల్లలు పుట్టే సమయంలో, గ్రహాలు అన్నింటినీ పదకొండవ స్థానంలో ఉండేలా ఆదేశిస్తాడు. రావణాశురుడి మాట తొమ్మిది గ్రహాలు వింటాయి. కానీ, పదోవ గ్రహమైన, శనిదేవుడు మాత్రం, రావణుడి మాటకి వ్యతిరేకంగా ఉంటాడు. శనిదేవుడు వెళ్ళి పన్నిండోవ స్థానంలో కూర్చుంటాడు. శనిదేవుడు ఇలా చేయడం అంటే, తనను అవమానించినట్లుగా భావించి, రావణాశురుడు కోపంతో రగిలిపోతాడు. ఆ తర్వాత తన శక్తి యుక్తులతో రావణాశురుడు, చాలా రోజులపాటూ శనిదేవుడ్ని బంధీగాచేసి ఉంచుతాడు. ఈ విషయం గురించి అనేక కథనాలలో చదివే ఉంటారు.
Ravana was great expert in art and ornamentation:
రావణాశురుడికి అలంకరణ పట్ల కూడా అభిరుచులు ఉన్నాయి. స్త్రీల కన్నా బాగా అలంకరణ చేసుకొనేవాడట. అలాగే గొప్ప కళాకారుడు కూడా. వీణను అద్భుతంగా మ్రోగించి, దేవతల సైతం ఆనందింపజేసేవాడు. దానికోసంగా దేవతలు, స్వర్గం నుండీ భూమికి దిగివచ్చేవారు. వీణను వాయిద్యంతో, శివుడిని సంతోషపరచగల సాధనం వీణ ఒక్కటే. ఆ దేవదేవుడిని ప్రసన్నం చేసేంత అద్భుతంగా వీణను మ్రోగించగలడ రావణుడు. ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలలో కూడా రావణాశురుడు దిట్ట. ఆయా శాస్త్రాలలో అవపోషణం పట్టిన కొద్దీ మందిలో రావణాశురుడు ఒక్కడు. మన దేశంతో పాటూ, శ్రీలంకలో ఇప్పటికీ రావణుడిని పూజిస్తారు. దైవంగా ఆరాధిస్తారు. మీకూ తెలుసా? రావణుడికి, రావణాశురుడు, అనే పేరు పెట్టింది సాక్షాత్తు ఆ మహాశివుడే. ఒకసారి రావణుడు(Ravanasura), శివుని దర్శనం కోసం కైలాసగిరికి వెళతాడు. అక్కడ నంది ఎదురవుతాడు. శివుడిని కలవనీయకుండ అడ్డుకుంటాడు నంది. ఆ కోపంతో రావణుడు, కైలాస పర్వతాన్ని రెండు చేతివేళ్ళతో ఎత్తేందుకు ప్రయత్నిస్తాడు. దాంతో, ధ్యానంలో ఉన్నా, మహాదేవుడికి చాలా కోపం వస్తుంది. దాంతో శివుడు, ఒక పాదం మోపడంతో, రావణుడి రెండు చేతివేళ్ళు, ఆ పర్వతం కింద నలిగిపోయాయి.
అప్పుడు రావణుడు, గట్టిగా అరవడం మొదలుపెడతాడు. ఆ రావణుడి అరుపులు, ఎంత గట్టిగా ఉంటాయంటే? భూమి మొత్తం కూడా దద్ధరిల్లిపోయి, కంపించిపోయంతగా. అపుడే శివుడు(Lord shiva), అతనికి రావణుడు(Ravana) అని పేరు పెడతాడు. గట్టిగా అరిచేవాడని ఆ పేరుకు అర్థం. అయితే? ఆ పేరు ఊరికే రాలేదు. శివుడి కోపం ఎంత భీకరంగా ఉంటుందో మనందరికీ తెలుసు. శివుడు, రావణాశురుడికి అంత తేలికగా లోంగిపోలేదు. శివుడిని ప్రసన్నం చేసుకున్నాకే అక్కడ నుండీ కదలాలని నిర్ణయించుకుంటాడు రావణుడు. దాంతో తాండవం ఆట మొదలుపెడతాడు. కైలాస పర్వతం(Kailasa) కింద, వేళ్ళు నలిగిపోతున్నా, శివుడిని ప్రసన్నం చేసుకొనేందకు చేస్తున్న రావణుడి తాండవం చూసి, శివుడికి మనసు కరుగుతుంది.
దాంతో మహాదేవుడు ప్రసన్నుడై, తన కోపాన్ని తగ్గించుకొని, రావణుడిని తన భక్తుడిగా అంగీకరిస్తాడు మహా శివుడు. భలం, భుద్ది కూడా రావణాశురుడి సొంతం. ఒక మనిషిలో మంచి, చెడు అనే గుణాలు ఉంటాయి. అందుకు సాక్ష్యం రావణాశురుడే. ఎంత శక్తి, సామర్ధ్యాలు ఉన్నా సరే. రావణాశురుడు తన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయాడు. ఇక మనమైతే సాధారణ ప్రజలం కదా! రావణాశురుడిలో అహంకారం అనేది లేకపోతే, రామాయణ(Ramayana) గాథ మన మరోలా ఉండేది. ఇలాంటి మరెన్నో Interesting facts, Amazing facts మీకోసం తీసుకువస్తాము. అప్పటి వరకూ సెలవు. Zombie Virus Awakened? (Virtual Facts Telugu)
Please do visit for more latest information posts on Virtual facts telugu
Comments
Post a Comment