Chandrayaan 3 Lunar Rover: Exploring the Moon's Surface Up Close
Chandrayaan 3 Lunar Rover: అంతరిక్ష పరిశోధనలలో, ప్రపంచ దేశాలు, ఎంతో ప్రగతి సాధించిన, జాబిల్లిపై అన్వేషణ ఓ సవాల్ గానే మారింది. చంద్రుడిపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను చేదించేందుకు భారత అంతరిక్ష ప్రయోగశాల Isro చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రయోగం Chandrayaan 3. 14 వ తేదీన, శుక్రవారం మధ్యాహ్నం 02:35 నిమిషాలకు, రెండోవ ప్రయోగ వేదిక నుంచి, మూడు కీలక Madule లతో, నింగి వైపు LVM 3 RACKET ప్రయోగం విజయవంతంగా ముగిసింది. జాబిల్లి దక్షణ ధృవంపై మరెన్నడూ చూడని రహస్యాల అన్వేషణకు భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ Isro..! కీలక అడుగు వేసింది. Lander, Rover, Propulsion Madule తో కూడిన భారత ప్రతిష్ఠాత్మక ప్రయోగమైనా Chandrayaan 3 ని ప్రయోగించింది. బాహుబలి రాకెట్ గా గుర్తింపు పొందిన LVM 3 (Launch Vehicle Mark 3) మరియూ M 4 తో కూడిన చంద్రయాన్-3 ని నిర్దిష్ట భూ కక్షలో ప్రవేశపెట్టింది ఇస్రో. సుదీర్ఘ ప్రయణం తర్వాత, August 23, సాయంత్రం 05:47 నిమిషాలకు, జాబిల్లి పై Lander అడుగు పెట్టనుంది. ఈ Mission విజయవంతం అయితే..? ఇప్పటి వరకూ..? చంద్రుడిపై Soft Landing చేసిన America, Soviet Union, China దేశాలతో పాటూ, చంద్రునిపై సాప్ట్ ల్యాండింగ్ చేసిన 4 వ దేశంగా, భారత్..! గుర్తింపు పొందనుంది. అంతేకాదు..? చంద్రుడి దక్షణ ధృవంపై అడుగు పెట్టి, చంద్రుడి దక్షణ ధృవ రహస్యాల అన్వేషణలను చేధించిన మొట్ట మొదటి దేశంగా, భారత్..! ప్రపంచం మొత్తం మీద, మొదటి స్థానంలో, ప్రత్యేకంగా నిలవనుంది.
రాకెట్ ప్రయోగం జరిగింది ఎలా? (How did the rocket launch happen?)
కచ్చితత్వ రాకెట్ కాల గమనం ప్రకారం 16 నిమిషాల తర్వాత, Racket నుండీ Madule విడిపోయింది. దీన్ని... భూమి చుట్టూ ఉన్నా, 170×36500 కిలో మీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెట్టింది. ప్రోపల్సియల్ మాడ్యుల్ భూమి చుట్టూ 24 రోజులు తిరుగుతుంది. క్రమంగా కక్షను పెంచుతారు. ఈ విన్యాసాలను Trans Lunar Injections గా పేర్కొంటారు. తర్వాత... చంద్రుడి దిశగా, Lunar Transfor Tragertary లోకి చంద్రయాన్ 3 ని పంపిస్తారు. చంద్రుడి గురుత్వాకర్షణలోకి వ్యోమ నౌక ప్రవేశించాకా..? Lunar Arbit Incesion ప్రక్రియ జరుగుతుంది. ఇందులో నిర్దిష్టంగా ఇందనం మండించి, చంద్రయాన్ 3 వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా..! దాన్ని..! జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి ఉడిసి పడుతుంది. అప్పటినుంచి అది, చందమామా(Moon) కక్షలో తిరుగుతుంది. అంతిమంగా... చంద్రుడి చుట్టూ, 100 కి.మీ ల ఎత్తులో ఉన్నా కక్ష లోకి దీన్ని ప్రవేశపెడతారు. మొత్తంగా... చంద్రయాన్ 3, సుమారు 3,84000 కి.మీ దూరం ప్రయాణించనుంది. చంద్రయాన్ 3 బరువు 3,900 కిలోలు. మొత్తం ప్రాజెక్ట్ కర్చు 613 కోట్లు.
చంద్రుడిని చేరాలంటే 40 రోజులెందుకు? (Why 40 days to reach the moon?)
చంద్రుడిపై రోవర్లు పంపించిన దేశాలలో, America కు చెందిన Appollo 11 కి నాలుగు రోజులు, Soviet Union (Rassia) కు చెందిన Luna 2 కి ఒకటిన్నర రోజు పడితే..? భారత్ కు చెందిన చంద్రయాన్ 3 కి మాత్రం 40 రోజులు పడుతోంది. అమెరికా, రష్యా లతో పోలిస్తే, భారత్ కు ఎక్కువ రోజులు పట్టడానికి కారణమేంటి? ఇస్రో ఆలస్యంగా, చంద్రుడిపైకి ల్యాండర్ ను పంపడంలో ఆంతర్యం ఏమిటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం!
దశాబ్దాల క్రితమే జాబిల్లిపై అమెరికా కాలుమోపగా, ఆ తర్వాత రష్యా, చైనాలు వంటి దేశాలు, తమ రోవర్ లను అక్కడ సురక్షితంగా దించగలిగాయి. భారత్ సైతం ఇదే ప్రయోగం భాగంగా, 2019 లో Chandrayaan 2 ను ప్రయోగించగా, చివరి క్షణంలో భారత్ కు చెందిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై హాట్ ల్యాండింగ్ అవ్వడంతో, చంద్రయాన్ 2 ప్రయోగం అంతటితో ముగిసిపోయింది. అయినా కూడా 90% చంద్రుడి యొక్క ముఖ్య రహస్యాలను చెందించగలిగింది. చంద్రుడిపై నీటి జాడలను Chandrayaan 2 ద్వారా కనుగొనడం మరో గొప్ప విశేషమనే చెప్పాలి. ఎందుకంటే..? చంద్రుడిపై నీరు ఉందని కనుగొన్న మొట్ట మొదటి దేశంగా, భారత్ కు చెందిన అంతరిక్ష ప్రయోగ సంస్థ ఒక్క ఇస్రో మాత్రమే కాబట్టి. అయితే! జూన్ 14 వ తేదీన చంద్రయాన్ 3 ను విజయవంతంగా ప్రయోగించిన, ఆ వెన్నెల రాజును చేరాలంటే మాత్రం, 40 రోజులకు పైగా సమయం తీసుకుంటోంది. మరి ఇస్రో కు నెలకు పైగా సమయం ఎందుకు పడుతోంది అని పరిశీలిస్తే..? భూమి నుంచీ 3.84 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్నా చంద్రుడి వద్దకు నేరుగా వెళితే..? తక్కువ వ్యవధిలోనే చేరుకోవచ్చు. అందుకు శక్తివంతమైన రాకెట్ ను వినియోగించాల్సిన అవసరం వుంటుంది. పైగా భారీ మొత్తంలో ఇంధనం అవసరం కూడా. దీంతో రాకెట్ పరిమాణం కూడా పెరుగుతుంది. అమెరికా, 1969 జూన్ 16 న చంద్రుడి పైకి అపోలో 11 ను ప్రయోగానికి, భారీ రాకెట్ ను ప్రయోగించింది. అపోలో ను మోసుకువెల్లిన శాటర్న్ వి రాకెట్ ఎత్తు 363 అడుగులు. ప్రస్తుతం ఇస్రో ప్రయోగించిన ఎల్.వి. ఎం 3 రాకెట్ ఎత్తు 142 అడుగులు మాత్రమే. ఇంధనం కూడా తక్కువ వాడుతుండడంతో ల్యాండింగ్ ఆలస్యమవుతోంది. దీని కోసంగా... భిన్నమైన ఆలోచనతో కొత్త విధానాన్ని కనుగొంది ఇస్రో. భూమి గురుత్వాకర్షణ సాయంతో, చంద్రుని వైపు పయనించే విధానాన్ని అనుసరిస్తోంది. ఈ క్రమంలో తొలుత చంద్రయాన్ 3 ని, రాకెట్ ద్వారా, భూమి చుట్టూ ఉన్నా 170/36,500 కిలో మీటర్ల దీర్గ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది. భూమి చుట్టూ 24 రోజుల పాటూ చక్కర్లు కొడుతూనే, చంద్రయాన్ 3 తమ కక్షను పెంచుకుంటూ పోతుంది. అలా చివరకు... చంద్రుడి(Moon) గురుత్వాకర్షణ క్షేత్రంలోకి చేరుకుంటుంది. ఈ పక్రీయకు దాదాపు 40 రోజులు సమయం పట్టనుంది. Where is the soul journey? (real facts in telugu)
Comments
Post a Comment