2070 వ సం౹౹ లో మన ప్రపంచం ఎలా ఉండబోతుంది? అయితే...! ఇది ఎంతవరకు నిజమో తెలీదు. కేవలం మన ఈ ప్రపంచం రోజు రోజుకు అభివృద్ధి అవుతున్నా టెక్నాలజీ ని బట్టీ ఒక అంచనా మాత్రమే. ప్రస్తుతానికి మనం ఈ 2022 సం౹౹ లో ఉన్నాం కదా! ప్రెసెంట్ ఈ 2022 సం౹౹ నుండీ 2070 సం౹౹ వరకూ అలా వెళదాం. ఇక విషయానికొస్తే! భవిష్యత్తులో మన సాంకేతిక పరిజ్ఞానం చాలా అభివృద్ధి చెందీ, మన ప్రతిరోజూ దిన చర్యలో చాలా మార్పులు రాబోతున్నాయి. అది ఎంతగా అంటే? మీరూ అస్సలు కలలో కూడా ఊహించని విధంగా. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యూచర్ టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ చూస్తే? మీరూ ఆశ్చర్యపోవాల్సిందే. 2022 సం౹౹ లో :- ఇప్పుడు మనం ఉంటున్నది 2022 వ సం౹౹ లో. అయితే! కొన్నీ నెలల్లోనే "బయోనిక్ ఐస్" ని చూడబోతున్నారు. చాలా మందికి వివిధ రకాల కళ్ళ సమస్యలు, దృష్టి లోపాలు ఉంటాయి, అలాంటి దృష్టి లోపాలున్నా వారి కోసం, ఇస్జ్రాయిల్ సర్జన్ లో, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, ఒక 70 ఏళ్ల ముసలావిడికి కుత్రిమ కళ్ళను అమర్చారు. అలాగే! బెల్జియం, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇలాంటి కుత్రిమ కళ్ళను తయారు చేసే పనిలో ఉన్నారు. 2023 సం౹౹ లో :- అమెరికాల...