Skip to main content

Virtual Real Fact (Virtual Facts Telugu)



ఈ భూమిపై మొట్ట మొదటిసారిగా మానవుల ఆవిద్భావం ఎలా జరిగింది? 

ఈ లోకంలో చాలా మంది ఈ భూమి మీద మానవ జాతిని దేవుడు సృటించాడని అనుకొని నమ్ముతూ ఉంటారు కదా. అయితే కొంత కాలం క్రితం శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే? కోతులు ఈ భూమి మీదకు ఎలా వచ్చాయి? కోతి రూపం నుండీ ఆది మానవుడుగా ఆ తర్వాత ఇప్పటి మానవుడి లా ఎలా రూపాంతరం చెందాడు? అనే ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు చాలా మందికి తరచుగా వస్తున్నవే. అయితే ఈ విశాల విశ్వంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భూమి భగ భగ మండే సూర్యుడు లా మండుతూ ఉండేది. ఆ తర్వాత చంద్రుడు ఆవిద్భావం తర్వాత చంద్రుని చల్లని వాతావరణం, వెన్నెల మూలంగా మన భూమిపై నీరు ఏర్పడడం జరిగింది. అయితే ఇలా భూమిపై నీరు ఏర్పడిన తర్వాత భూమిపై ఏర్పడిన నీటిలో మొదటగా  జీవం అనేది ఆవిద్భవించింది. అంటే మొదటగా ఏక కణ జీవులు ఆవిద్భవించాయి. 

ఆ తర్వాత కోటాను కోట్ల కొద్దీ అనేక జీవరాసులుగా రూపాంతరం చెందాయి. అంటే ఈ జీవులు సూర్య రశ్మిని ఆహారంగా తీసుకొని ఆక్సిజన్ ను బయటకు విడుదల చేసేవి. అలా కొంత కాలం తర్వాత ఈ జీవులే మరిన్ని అనేక రకముల జీవులుగా రూపాంతరం చెంది, మరిన్ని వివిధ జంతువులుగా రూపాంతరం చెందుతూ వచ్చాయి. అలా రూపాంతరం చెందిన కొన్ని జీవులు వెన్నెముకను కలిగి ఉండేవి. ఇంకా కొంత కాలానికి ఆ వెన్నెముక కలిగిన జీవులు భూమి మీదకు రావడం మొదలుపెట్టాయి. కొన్ని సంవత్సరాలకు ఆ జీవులు భూమి మీద నడుస్తూ, అవి కూడా వాటి రూపాలను మార్చుకొంటూ, ఈ భూమి మీద నివసించడం మొదలుపెట్టాయి. అయితే శాస్త్రవేత్తల కథనం ప్రకారం మానవుడు కోతి నుండి, చింపాంజీ నుండి వచ్చారని చెబుతుంటారు కాదా! కానీ అయితే అస్సలు నిజం ఏమిటంటే? మనుషులు, కోతులు మరియూ చింపాంజీలు కూడా ఒక రకం జీవుల నుండి వచ్చినవే. ఆ జీవులకు తోక ఉండేది కాదు. మనకు, కోతులు, చింపాంజీలకు ఉన్న తేడా, వాటి లాగా మానవుడికి తోక అనేది ఉండేది కాదు. వాటికి మనకి తేడా ఆ తోక ఒక్కటి మాత్రమే. 

ఇలా చింపాంజీలు, కోతులు మరియూ మనిషి వేరుపడి, వివిధ జాతులుగా మారిపోయీ, దాదాపు 32, లక్షల సం౹౹ రాలు పైనే అవుతుంది. ఇంకా చెప్పాలంటే మనిషి అనే జీవి, ఈ భూమి మీదకు వచ్చిన మొదట్లో మనిషి కూడా కోతి లాగా చెట్లు ఎక్కుతూ ఉండేవాడటా. అలా మనిషి కూడా ఒక జంతువు లాగానే కొన్ని లక్షల సం౹౹రాలు గడిపాడు. అయితే కొన్ని వేల సం౹౹ లకు ఆదిమానవుడు కూడా కొంత ఆలోచించి ఈ భూమి మీద తన కాళ్లతో నడవడం మొదలుపెట్టాడు. అలా మనిషి తన కాళ్లతో నడవడం మొదలుపెట్టాకా, తన రెండు చేతులు అనేవి కాళీగా ఉండేవటా. 

ఇక ఆ తర్వాత మనిషి, తన చేతులను ఉపయోగించి, వాటిని, వీటిని కొన్ని వస్తువులను కొట్టుకోవడం అలవాటు చేసుకొన్నాడు. అయితే ఆదిమానవుడు చేసిన మొదటి మంచి పని అదే అవడం విశేషం. ఎందుకంటే! అప్పటికే ఈ భూమి మీద మనిషి కంటే పెద్ద పెద్ద జంతువులు బ్రతుకుతూ ఉన్నాయి. వాటి నుండీ ఆదిమానవుడు తప్పించుకోవడానికి, ఆదిమానవుని రెండు చేతులే ఉపయోగపడేవటా. ఆ చేతుల నుండే వివిధ ప్రమాదకర జంతువుల నుండీ రాళ్లు, కర్రలు వాడి తనను తాను రక్షించుకొనేవాడట. అలా ఆదిమానవుడి చేతులు కేవలం చెట్లు ఎక్కడానికి మాత్రమే కాకుండా, వస్తువులను పట్టుకోవడానికి మార్పు చెందుతూ వచ్చాయి. ఆ తర్వాత రాతి యుగం అనేది మొదలైంది. రాతి యుగమంటే "స్టోన్ ఏజ్" అని అర్థం. ఈ రాతి యుగాన్ని "స్టోన్ ఏజ్" అని ఎందుకు పిలుస్తారంటే? ఆ రోజుల్లోనే ఆదిమానవుడు రాళ్లను ఆయుధాలుగా తయారు చేసుకొని వాడడం మొదలుపెట్టాడు. 



తను తయారు చేసున్న ఆయుధాలతో, కొన్ని జంతువులను వేటాడి చంపేసేవాడు. అయితే అప్పటివరకూ కేవలం పచ్చి మాంసాన్నే తింటున్న ఆదిమానవుడు, ఒకసారి అడవిలో రగులుకున్నా కారు చిచ్చు రాచుకోవడం వలన కాలిన మాంసాన్ని తినవలసి వచ్చింది. అయితే ఆదిమానవుడికి పచ్చి మాంసం కన్నా కాలిన మాంసమే రుచిగా అనిపించింది. ఆదిమానవుడికి పచ్చి మాంసాన్ని ఎలా కాల్చాలో, నిప్పుని ఎలా రగిలించాలో చాలా కాలం పాటూ తెలిసేది కాదు. అయితే ఆ సమయంలోనే ఒక అద్భుతం జరిగింది. ఒకానొక సందర్బంలో రాయి రాయి ని రాజేయడం వలన నిప్పు పుడుతుందని ఆదిమానవుడు కనిపెట్టడం జరిగింది. ఈ ఒక్క ఐడియానే ఆదిమానవుడి జీవితాన్నే పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. అలా పుట్టించిన నిప్పుతో వేటాడిన మాంసాన్ని కాల్చుకొని తినడం మొదలుపెట్టారు. అప్పటివరకూ పచ్చి మాంసాన్ని తింటున్నా ఆదిమానవుడు, కాల్చిన మాంసాన్ని తినడంతో ఆదిమానవుడి మెదడు పరిమాణం అభివృద్ధి అవడంతో పాటూ పెరగడం మొదలయ్యింది. అలాగే వాళ్ళు శరీర భాగం, మొఖ భాగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకోవడం జరిగింది. ఆదిమానవుడు పచ్చి మాంసాన్ని తినడం వలన మొఖ డవడలు మాంసాన్ని నమిలేన్దుకు అనూకూలంగా, అనుగుణంగా పెద్దదిగా ఉండేది. అయితే కాల్చిన మాంసాన్ని ఎప్పుడైతే తినడం మొదలుపెట్టాడో అప్పటినుండీ ఆదిమానవుడి మొఖ డవడలు చిన్నవిగా మారిపోయి, మొఖంలో ఎన్నో మార్పులు వచ్చి, ఆదిమానవుడి మొఖం అనేది ఒక్కసారిగా మరింత అందంగా మార్పు అనేది మొదలయ్యింది. అంతేకాకుండా ఇతర ఇతర జంతువుల నుండీ వారు రక్షించుకొనేందుకు ఆ నిప్పుని బాగా వాడుకునే వారు. అప్పట్లో ఆదిమానవులు కేవలం జంతువుల వేటపైనే ఆధారపడి ఉండే వారు. 

అలా వేటాలో జంతువుల వెంబడి పరిగెత్తుతున్న సమయంలో వాళ్ళ వెంట్రుకలు కొద్దీ కాలానికే రాలిపోవడం మొదలయ్యాయి. ఇక ఆదిమానవుడి ఉష్ణోగ్రతను తగ్గించడానికి వారి శరీరంలో చమట గ్రంధులు కూడా రూపాంతరం చెందడం జరిగింది. ఆ తర్వాతా ఆదిమానవుడు గుంపులు గుంపులుగా జీవించడానికి మొదలుపెట్టారు. ఎందుకంటే! ఇలా గుంపులు గుంపులుగా జీవిస్తే, వేట అనేది సులభంగా ఉండేది. అలా వేటాడిన తర్వాత అందరూ నిప్పు దగ్గరే కూర్చోని ఆ మాంసాన్ని వండుకొని తినే వారు. కానీ అప్పటి ఆదిమానవుడికి మాట్లాడడం అనేది తెలిసేది కాదు. అయితే మొదటగా ఆదిమానవుడి ఫీలింగ్ అనేది ఉంది అంటే అది నవ్వు మాత్రమే. అలా కాలం గడిచేకొద్దీ ఆదిమానవుడు మార్పు చెందుతూ వచ్చాడు. అలా కొద్దీ సంవత్సరాలకు వారి స్వర పేటికలో రూపాంతరం చెంది, కొన్ని మార్పులు రావడంతో కొన్ని కొన్ని శబ్దాలు చేయడం మొదలుపెట్టారు. అయితే మన చరిత్ర ఏమి చెబుతుందంటే? ఆదిమానవుడు ఆవిద్భవించింది ఆఫ్రికా దేశంలో. ఆ తర్వాత జనాభా అనేది క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇలా ఆహారం కోసం ఆదిమానవులు వెతుకుతున్న క్రమంలో ఇతర ప్రదేశాలకు వెళ్లిపోతూ ఉండే వారు. అలా వెళుతూ వెళుతూ కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. మీకు తెలుసా? అప్పట్లో ఐదు రకాల ఆదిమానవుల జాతులు మాత్రమే నివసించే వారు. వారిలో ఒక్కరూ హోమో సెఫియన్స్, రెండో వారూ హోమో హెబిలీస్, హోమో ఇరెక్టర్స్, హోమో నీయందథాస్. అయితే ఈ హోమో సెఫియన్స్ మాత్రమే ఆఫ్రికా దేశంలో నివసిస్తూ స్థిరపడ్డారు. 


అంటే! అపుడున్నా హోమో సెఫియన్స్ లే మన పూర్వీకులు అన్న మాట. అయితే ఇక్కడ మీకొక డౌట్ వచ్చి ఉండాలి అది! మిగిలిన ఆదిమానవుల జాతులు ఏమయ్యాయి అనే కదా? ఆ మిగిలిన నాలుగు ఆదిమానవుల జాతులు ఆ తర్వాత కాలంలో అంతరించిపోవడం జరిగింది. అలా మిగిలిన ఆదిమానవుల జాతులు అంతరించపోవడానికి చాలా కారణాలే ఉన్నాయని శాస్త్రవేత్తల సైతం వారి రీసెర్చ్ లో కనిపెట్టారు. ఆ మిగిలిన ఆదిమానవుల నాలుగు జాతులు, తిండి దొరకకనో, జబ్బుల వల్లనో, వాతావరణం మార్పుల వల్లనో అంతరించిపోయి ఉంటారని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మిగిలిన నాలుగు జాతులు అంతరించిపోగా చివరికి హోమో సెఫియన్స్ మాత్రమే జీవించి ఉన్నారు. అంటే! ఆ నాలుగు జాతుల కంటే ఆ హోమో సెఫియన్స్ మాత్రమే తెలివిగలవారని అర్ధం. ఇక తర్వాత! ఇప్పటికి 60,000 సం౹౹ రాల పూర్వం ఈ హోమో సెఫియన్స్ లే ఈ భూమి మీద ఉన్నా అన్నీ ప్రాంతాలకు వలసలు వెళ్లారు. అయితే ఆదిమానవుడు తన పూర్తి జీవితం కేవలం వేట మీదే ఆధారపడి బ్రతికే వాడు. అయితే ఇప్పటికి 12,000 సం౹౹ రాల క్రితం ఆదిమానవుడి జీవితంలో ఒక అద్భుతం అనేది జరిగింది. ఆ ఆద్భుతమే! ఆదిమానవుడు కాస్తా ఇప్పటి మనిషిగా మార్చింది. మరో ఆద్భుతమే వ్యవసాయం. అంటే ఆదిమానవుడు కూడా చిన్న చిన్నగా వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు. మొదటగా మొక్కలను పెంచుకొని, వాటిని తింటూ బ్రతకడం మొదలుపెట్టాడు. వారు గుంపులుగా జీవిస్తూ, ఒక్కొక్కరూ ఒక్కొక్క పనిని చేస్తూ ఉండే వారు. 

ఆ తర్వాత కూడా రక రకాల వృత్తులుగా కూడా ఏర్పడ్డారు. అలా కాల క్రమీణా ఆదిమానవుడు మార్పు చెందుతూ ఇప్పటి మనిషిలాగా మారిపోయాడు. అంటే! ఒక్కప్పుడు నవడం కూడా తెలియని మనిషి, ఇప్పుడు చాలా వరకూ అప్డేట్ అయ్యీ, ఇప్పుడు ఇతర గ్రహాల మీదకు వెళ్లే స్థాయి వరకు అభివృద్ధి చెందాడన్న మాట.

ఒక్కప్పుడు భగ భగ మని మండే భూమి కాల క్రమీణా చల్లబడి ఇప్పుడు కొన్ని కోట్ల జీవరాసులకు జీవితాన్ని ఇస్తుంది. ఇవ్వనీ ఎలా అయితే జరిగాయో, అదేవిధంగా ఏదో ఒక రోజు మనిషి మళ్ళీ ఈ భూమి మీద అంతరించిపోవడం గ్యారెంటీ. ఎందుకంటే! ఈ భూమి మీద మానవుడు చేసే తప్పిదాలే అందుకు కారణం. ఉదాహరణకు....గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ ఇలా మానవుడు చేసే కొన్ని కొన్ని పెద్ద తప్పులు వలన. మీకు తెలుసా! ఈ భూమి మీద జీవిస్తున్నా ప్రతి జీవరాశి మన ఫ్యామిలీ నే. ఎందుకంటే ప్రతి జీవరాశి ఆదిమానవుడి నుండి వచ్చిందే.


--- The End

Comments

  1. Super topic, thanks for the information, i want to upload this story in my youtube

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

What was the reason for shutting down nutrine company? (Virtual Facts Telugu)

What was the reason for shutting down nutrine company? (Virtual Facts Telugu) Nutrine Chocolate కంపనీ మీకూ గుర్తుందా? పోనీ..? మనందరికీ చాలా చాలా ఇష్టమైన Nutrine Aasa Chocolate గుర్తుందా? పోనీ..? తేనేతో చేసిన మహా లాక్టో, హనీ ఫ్యాట్ Chocolates గుర్తుందా..? మరి ఇప్పుడు ఆ చాక్లెట్స్ ఏమైపోయాయి? నూట్రిన్ నుండీ తయారయ్యే ప్రతి ఒక్కటి కూడా మన దేశంలో చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే..? ఇది మన తెలుగు ప్రైడ్. మరీ! చాక్లెట్ ఇండస్ట్రీ ని, మన దేశంలో ఒంటి చేత్తో ఏలిన వ్యక్తి..! మన తెలుగు వాడు. అలాంటి మంచి చాక్లెట్ బ్రాండ్ కంపెనీని ఎందుకు నిలిపివేసారు? అసలు నూట్రిన్ కంపనీ వ్యవస్థాపకుడు ఎవరూ? అనేది ఇప్పుడు ఈ డాక్యుమంటరీ ద్వారా తెలుసుకుందాం! How did nutrine company grow?: మన పిల్లల బర్త్ డే ఫంక్షన్స్ కీ కచ్చితంగా నూట్రిన్ ఆశ చాక్లెట్లు ఉండాల్సిందే! అలా... ప్రతి పిల్లలు తమ తమ పుట్టినరోజున నూట్రిన్ ఆశ చాక్లెట్లు లను పంచడం ఒక అలవాటుగా మారిపోయిందంటే... ఆ చాక్లెట్ రుచిని మరవడం అనేది అసాధ్యమనే చెప్పచ్చు. అంతలా ఆశ చాక్లెట్..! పిల్లలు నుండీ పెద్దల వరకూ మనసు దోచుకున్న మన భారతదేశ సంస్థ మాత్రమే కాకుండా మన తెలుగు రాష్...

Tirumala Tirupati balaji mysterious story

  Tirumala Tirupati b alaji  mysterious story  తిరుమల బాలాజీ...! ప్రపంచంలోనే అత్యాద్మిక, ధనిక గొప్ప దేవాలయాలలో 2 వ స్థానంలో ఉన్నా ప్రముఖ అత్యాద్మిక, గొప్ప ధనిక దేవాలయం గా ప్రఖ్యాత చెందిన దేవాలయం... తిరుమల దేవాలయం. నిజానికి... Tirumala temple 2011 వ సంవత్సరం వరకు కూడా మొదటి స్థానంలో ఉండేది. ఆ తర్వాత Ananta padmanabha swami temple   లో సీక్రెట్ వాల్స్ ఓపెన్ చేశాకా, ఆ temple నెట్వర్క్ వచ్చేసి 1.0 లక్షల కోట్లు గా పెరిగి Tirumala ను ఓవర్ టేక్ చేసిందని చెబుతారు. కానీ అది నిజం కాదు. తిరుమల ఎసెట్స్ కౌంట్ చూస్తే..! బ్యాంక్ లో..! 10,250 Kg ల శ్రీవారి బంగారాన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేసింది TTD Board. అదేకాకుండా... 2,500 Kg ల బంగారం జువెలరీ రూపంలో ఉంది. 16,000 కోట్లు నగదు రూపంలో బ్యాంక్ లో డిపాజిట్ చేసుంది. India మొత్తంలో తిరుమల శ్రీవారి ప్రోపర్టీస్ 960 ఉన్నాయి. ఈ లెక్కన..! శ్రీవారి ఆస్తులు మొత్తం ఎంతుందో తెలుసా..? 2.5 లక్షల కోట్లు గా ఉంది. అయితే... ఇప్పటివరకూ తిరుమల టాప్ ప్లేస్ లోనే ఉంది. కాకపోతే..? పద్మనాభ స్వామి టెంపుల్ లో ఉండేది యాంటిక్స్ కిందకు వస్తాయి కాబట్టి, వాటి వి...

Virtual Facts Telugu Episode - 4

Fact No - 1: పాములు వాటి చర్మాన్ని ఎందుకు విడుస్తాయి?  సాధారణంగా పాములు వాటి చర్మాన్ని విడుస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే? పాములు వాటి చర్మాన్ని ఎందుకు విడిచి వెళతాయి అనేదే ఇప్పుడు  చెప్పబోయే ఈ ఫాక్ట్. అయితే? ఈ చర్మం వదిలే ప్రక్రియ ఒక్క పాములు మాత్రమే కాదు, దాదాపు ప్రతి జీవరాశి చేస్తుంది. అంతేందుకూ? మన మనుషులనే ఒక ఉదాహరణగా తీసుకోండి! మనుషుల శరీరం నుండీ కొన్ని మిలియన్ ఆఫ్ స్కిన్ సెల్స్  అనేవి కిందపడుతూ ఉంటాయి. అయితే? మన లాగా ఈ స్కిన్ సెల్స్ ముక్కలు ముక్కలుగా కింద పడేయవు. అవి ఒక లాయర్ లా అలాగే, ఆ జీవి ఉన్నా ఆకారం ఎలావుందో అలానే తన యొక్క చర్మాన్ని ఆ జీవి విడిచిపెడుతుంది. అలా ఒకే విధమైన పద్దతిలో ఆ జీవి తన చర్మాన్ని విడిచిపెట్టేదానినే...ఎగ్ డీసీజ్ అని అంటారు.    ఉదాహరణకు : ఒక పాము చర్మంతో పుట్టిందనుకోండి. ఆ పాము యొక్క బాడీ ఎదుగుదల అవుతుంది కానీ, ఆ పాము బాడీతో పాటూ, ఆ పాము యొక్క చర్మం మాత్రం ఎదుగుదల అనేది ఉండదు. ఆ పాము శరీరం పైనున్నా చర్మం కాకుండా మరొక లోపలి పొర చర్మం ఉంటుంది కదా, అది కూడా ఎదుగుదల అవుతుంది. ఆ  లోపలి పొర చర్మాన్ని వదిలేస్తుంది. ఒక పాము 4 ను...