Description : Explore NASA's groundbreaking discovery of an Earth-like planet in space.
ఈ అనంత విశ్వంలో జీవం మనుగడ సాగించడానికి ఆవాసం ఉన్నా ఏకైక గ్రహం మన భూమి ఒక్కటే(Earth). ఇక్కడ ఉండే గాలి, నీరు, వాతావరణం సకల జీవ జాతులకు ప్రధానం అని చెప్పచ్చు. అయితే...? సువిశాల విశ్వంలో..! భూమి తప్ప మిగిలిన గ్రహాలు, నక్షత్రాలు ఉపగ్రహాలు ఏవీ నివాస యోగ్యానికి పనికిరావా? అసలు అక్కడ జీవం అనేదే లేదా? ఒక వేళ జీవం అక్కడికి వెళితే మనుగడ ను సాగించగలదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మన శాస్త్రవేత్తలు, ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
అయితే..! ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది, TOI 700 E అనే బుల్లి భూ గ్రహం. NASA శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ బుల్లి గ్రహం యొక్క కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
నాసా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో అతి పెద్ద విజయాన్ని సాధించారు. అదే... భూమికి ప్రత్యామ్నాయంగా, నివాస యోగ్యమైన, భూ పరిమాణ గ్రహాన్ని NASA కనుగొనడం జరిగింది. ఈ కొత్త గ్రహంపై జనం ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు నాసా శాస్త్రవేత్తలు. Transiting Exoplanet Survey ద్వారా TOI 700 E అని పిలువబడే, భూ పరిమాణ ప్రపంచాన్ని గుర్తించారు. అంతేకాదు..! ఈ కొత్త Planet పై 95% శాతం భూమి ఉందని చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలు.
విశ్వంలో భూమి లాంటి వాతావరణం కోసం ఎప్పటినుంచో అన్వేషణ కొనసాగుతోంది. అంతరిక్ష యానంపై దృష్టి సారించిన అమెరికాతో సహా, చాలా దేశాలు అంగారకుడు, చంద్రుడు పై జలరాశి ఆచూకీ కోసం ఎన్నో అన్వేషణలు, పరీక్షలు నిర్వహించారు. వ్యోమగాములను పంపి, అంతరిక్షంలో జీవనయానం సాగించే అవకాశాలపై విశ్వ ప్రయత్నాలు, విసృత పరిశోధనలు చేస్తున్నారు. గతంలో కూడా భూమిని పోలినటువంటి గ్రహాలను గుర్తించారు ఖగోళ శాస్త్రవేత్తలు.
వాటికి TOI 700 B, C, D అని పేర్లు పెట్టారు. గతంలో కనుగొన్న గ్రహాలకు కొనసాగింపుగా, తాజాగా గుర్తించిన కొత్త గ్రహానికి TOI 700 E గా నామకరణం చేశారు. Planet D కూడా నివాస యోగ్యామైన జోన్ గా ప్రకటించారు శాస్త్రవేత్తలు. అయితే TOI 700 E పై మరిన్నీ పరిశోధనలు చేసేందుకు అదనంగా మరో ఏడాది సమయాన్ని అడుగుతున్నారు నాసా శాస్త్రవేత్తలు.
మనకు తెలిసిన బహుళ, చిన్న నివాస యోగ్య గ్రహాల్లో ఇది ఒకటి అని దక్షణ California లోని NASA JET PROPULSION LABORATORY Chief Emily Gilbert చెప్పారు. Planet E, Planet D కంటే 10% శాతం చిన్నది అని చెప్పారు Gilbert. CRT లో జరిగిన 241 వ American Astronomical Association Meeting లో తమ పరిశోధన సారాంశాన్ని వెల్లడించారు గిల్ బర్ట్.
TOI 700 అనేది...? దక్షణ రాశిలో, 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా, ఒక చిన్న, చల్లని మరు గుజ్జు నక్షత్రం. 2020 లో గిల్ బర్ట్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం, ప్లానెట్ D ను గుర్తించినట్లు ప్రకటించారు. దీనిపై నివాస యోగ్యమైన వాతావరణం ఉన్నట్లు, అప్పట్లోనే శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. దీనిపై కొనసాగుతున్న పరిశోధనలో ప్లానెట్ E బయటపడింది. గిల్ బర్ట్ బృందం పరిశోధనలు పూర్తి అయినట్లయితే...? భూమికి ప్రత్యామ్నాయంగా మరో గ్రహం ఆవిద్భవించినట్లే. గ్రహాంతర వాసుల కోసం జరుపుతున్నా అన్వేషణలకు పులుస్టాప్ పెట్టీ, మనమే మరో గ్రహ వాసానికి సిద్దం కావచ్చు.
Comments
Post a Comment