Description : Explore NASA's groundbreaking discovery of an Earth-like planet in space. ఈ అనంత విశ్వంలో జీవం మనుగడ సాగించడానికి ఆవాసం ఉన్నా ఏకైక గ్రహం మన భూమి ఒక్కటే(Earth). ఇక్కడ ఉండే గాలి, నీరు, వాతావరణం సకల జీవ జాతులకు ప్రధానం అని చెప్పచ్చు. అయితే...? సువిశాల విశ్వంలో..! భూమి తప్ప మిగిలిన గ్రహాలు, నక్షత్రాలు ఉపగ్రహాలు ఏవీ నివాస యోగ్యానికి పనికిరావా? అసలు అక్కడ జీవం అనేదే లేదా? ఒక వేళ జీవం అక్కడికి వెళితే మనుగడ ను సాగించగలదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మన శాస్త్రవేత్తలు, ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే..! ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది, TOI 700 E అనే బుల్లి భూ గ్రహం. NASA శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ బుల్లి గ్రహం యొక్క కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం! నాసా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో అతి పెద్ద విజయాన్ని సాధించారు. అదే... భూమికి ప్రత్యామ్నాయంగా, నివాస యోగ్యమైన, భూ పరిమాణ గ్రహాన్ని NASA కనుగొనడం జరిగింది. ఈ కొత్త గ్రహంపై జనం ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు నాసా శాస్త్రవేత్తలు. Transiting Exoplanet Survey ద్వారా TOI 700 E అని పిలువబడే, భూ పరిమాణ ప్రపంచాన్ని ...