సాధారణంగా! మన భూమిపై(Earth) పగలు, రాత్రులు అనేవి సహజ సిద్ధమైన ప్రకృతి ప్రక్రియ. ఒక వేళ మన భూమిపై నిరంతరాయంగా 24 గంటలు, వెలుగు లేని చీకటి మాత్రమే ప్రపంచం అయితే ఎలా ఉంటుంది. అస్సలు ఊహించలేము కదా! మరి...మన భూమిపై(Earth) భగ భగమని మండుతూ, చీకటిని చీల్చుకొని, ప్రతి జీవి మనుడగకు జీవితాలలో వెలుగునిచ్చే మన సూర్యుడు(Sun) లేని చీకటి ప్రపంచంలో బతకడం ఈ భూమిపై(Earth) పుట్టిన ఏ జీవికి అది అసాధ్యమని మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే! వెలుగు లేని మనుడగను సాగించడం, ఏ జీవి కూడా అలా జీవించడం అనేది ఒక ఊహ మాత్రమే. ఎందుకంటే! అది ఊహకు కూడా అందని ఒక భయాంకర దృశ్యమే అవుతుంది కనుక. అయితే? తెలంగాణ రాష్ట్రంలో, పెద్ద పల్లె జిల్లా, సుల్తానాబాద్ మండలంలో, కొదురుపాక(Kodurupaka Village) అనే గ్రామంలో మాత్రం ప్రకృతికి విరుద్ధంగా జరిగి, ప్రకృతికే సవాలు ను విసిరింది ఈ చిన్ని గ్రామం. ప్రతి రోజూ 16 గంటలు చీకటిలోనే గడుపుతున్నా ఆ గ్రామం పేరే కొదురుపాక(Kodurupaka). మరి ఆ ఊరిలో జరుగుతున్నది వింతనా? లేక అంతుచిక్కని మిస్టరీ నా? ప్రతిరోజు ఉదయాన్నే మనందరినీ నిద్రలేపి పలకరించే అతిథే భానుడు(Sun). వద్దూ అంటే మానడు, రమ్మన్నప్పుడల్లా ...